TG TET Hall Tickets : అందుబాటులోకి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు..ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

అందుబాటులోకి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు
డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి..!!
TET Hall Tickets
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG TET 2025)కు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం సాయంత్రం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
అభ్యర్థులు జర్నల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిర్ణీత తేదీల్లో ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు సెషన్- 1; మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి.
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
https://tgtet.aptonline.in/tgtet/HallticketFront
జూన్ 18, 19, 24 (మొదటి షిఫ్టు), 28, 29, 30 తేదీల్లో పేపర్ -2 పరీక్షలు జరగనుండగా.. జూన్ 20, 23, 24 (రెండో షిఫ్టు), 27 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 15 నుంచి 30 తేదీ వరకు టెట్‌కు దరఖాస్తులు ఆహ్వానించగా 1.83లక్షల దరఖాస్తులు వచ్చాయి. పేపర్ 1కు 63,261మంది, పేపర్-2కు 1,20,392మంది దరఖాస్తు చేసుకోగా.. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారు 15వేల మంది వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.