Ration Distribution : 3 నెలల రేషన్ ఇంకా తీసుకోలేదా?.. మీకో బిగ్ అలర్ట్.. గుడ్ న్యూస్..!!

టెన్షన్ పడకండి..ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రేషన్ షాపులు పని చేస్తాయి

On
Ration Distribution : 3 నెలల రేషన్ ఇంకా తీసుకోలేదా?.. మీకో బిగ్ అలర్ట్.. గుడ్ న్యూస్..!!

 

హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు

తెలంగాణలో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల స్టాక్ లేకపోవడంతో సమస్యలు తలెత్తాయి. రేషన్ అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Click Here to Read More👉 Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్

రేషన్ పంపిణీ గడువు ముగిస్తే.. ఇక రేషన్ తీసుకోలేమేమోనని కంగారు పడుతున్నారు. ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రేషన్ పంపిణీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Click Here to Read More👉 Prajapalana : ప్రజావాణికి వచ్చే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి

3 నెలల రేషన్‌ సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ జూన్ 30వ తేదీలోపు వారి కోటా పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 3 నెలల స్టాక్ అందుబాటులో ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రేషన్ షాపులు పని చేస్తాయన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చౌక ధరల దుకాణాలు తెరిచే ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Click Here to Read More👉 Wife victims : భర్త నాలుకను కొరికి మింగిన భార్య

హైదరాబాద్ జిల్లా పరిధిలో దాదాపు 48శాతం కార్డుదారులకు 3 నెలల రేషన్ సరుకులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి కార్డుదారునికి రేషన్ సరుకులు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. కార్డుదారులు రేషన్ బియ్యాన్ని ఎవరికైనా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బియ్యం విక్రయించిన వారు పట్టుబడితే కార్డు రద్దు చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 3 నెలల రేషన్ ను జూన్ లోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. కేంద్రం సూచనలతో తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల రేషన్ ఒకేసారి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. జూన్, జూలై, ఆగస్ట్ కోటా సన్న బియ్యాన్ని ఈ నెలలోనే పంపిణీ చేస్తోంది. బయోమెట్రిక్ ద్వారా నెలనెలకు ధ్రువీకరణ వేర్వేరుగా చేయాలని అధికారులు సూచించారు.

Views: 94

Latest News

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్ Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్
వెబ్ డెస్క్ - ప్రభాత సూర్యుడు అప్పట్లో BRS ప్రభుత్వం, KCR పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ప్రవీణ్ కుమార్ ఎంక్వైరీకి పిలిచేసరికి మాట మార్చాడు....
Prajapalana : ప్రజావాణికి వచ్చే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి
UP CM Adityanath : అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
Wife victims : భర్త నాలుకను కొరికి మింగిన భార్య
Vigilance Rides : బ్రేకింగ్ న్యూస్ -- మున్సిపాలిటీ కార్యాలయాలపై విజిలెన్స్ తనిఖీలు
Bonalu Festivel : లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు