Wife victims : భర్త నాలుకను కొరికి మింగిన భార్య

ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్

On
Wife victims : భర్త నాలుకను కొరికి మింగిన భార్య

వామ్మో.. ఇట్ల తయారయ్యిరేందే  మీరంతా..!

  • భర్త నాలుకను కొరికి మింగిన భార్య..
  • ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్..!!

ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి.. చిన్న చిన్న విషయాలే పెద్దవిగా మారి.. ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి.. వీటికితోడు వివాహేతర సంబంధాలతో భార్య.. భర్తను కడతేర్చడం.. లేదా.. భర్త భార్యను భర్తను చంపడం లాంటి ఘటనలు.. చాలా ప్రాంతాల్లో వెలుగుచూస్తున్నాయి..

ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి.. చిన్న చిన్న విషయాలే పెద్దవిగా మారి.. ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి.. వీటికితోడు వివాహేతర సంబంధాలతో భార్య.. భర్తను కడతేర్చడం.. లేదా.. భర్త భార్యను భర్తను చంపడం లాంటి ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి.. ఇలాంటి ఘటనలు కుటుంబాలను చిన్నాభిన్నం చేయడంతోపాటు.. పిల్లలను అనాథలుగా మారుస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. బీహార్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.. భార్యాభర్తల మధ్య గొడవలు హద్దు మీరితే పరిణామాలు ఎంత తీవ్రతకు దారితీస్తాయో చెప్పే ఈ విచిత్ర సంఘటన బిహార్‌లోని గయాలో కలకలం రేపింది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బీహార్ ఖిజ్రాసరాయ్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ దంపతుల మధ్య చిన్న గొడవ తలెత్తింది.. దీంతో ఇద్దరూ దుర్భాషలాడుకోవడం మొదలుపెట్టారు. మాటామాటా పెరిగింది.. అది చూస్తుండగానే ఘర్షణగా మారింది. దీంతో భార్య.. భర్తలు పొట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే.. భార్య ఆగ్రహంతో ఊగిపోయింది.. పొట్లాడుకుంటున్న సమయంలో భార్య.. తన భర్త నాలుకను కొరికి కరకర నమిలి మింగేసింది. దీంతో తీవ్రమైన రక్తస్రావంతో భర్త అక్కడికక్కడే కుప్పకూలాడు.. భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడం చూసి.. కుటుంబసభ్యలు, గ్రామస్థులు అతన్నీ సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే.. చాలా రక్తం పోవడంతో.. అతనికి ప్రాథమిక చికిత్స చేసి మగధ్‌ వైద్య కళాశాలకు సిఫారసు చేసినట్లు డాక్టర్‌ మీనారాణి వెల్లడించారు.. వెంటనే అక్కడి నుంచి తరలించామని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. ఆసుపత్రిలో మరో సీన్ రివర్స్ అయింది.. ఇంత జరిగి ఆస్పత్రికి వెళ్లినా కూడా అక్కడ భార్యాభర్తలు గొడవపడ్డారని.. స్థానికులు తెలిపారు.. కాగా.. సంచలనంగా మారిన ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Views: 230

Related Posts

Latest News

Narayana's NOVOUS Event : నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి Narayana's NOVOUS Event : నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి
నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి చైతన్యపురి నారాయణ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు  అద్భుత నృత్య ప్రదర్శనతో షర్మిల భార్గవికి ప్రశంసల వెల్లువ...
79th Indipendent : ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Achampet News : అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్
Rangareddy News : రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా  కె చంద్రా రెడ్డి బాధ్యతలు
Rangareddy News : ప్రణాళిక బద్దంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించాలి
CM Relief Fund : పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్