Rangareddy News : రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా కె చంద్రా రెడ్డి బాధ్యతలు

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా కె చంద్రా రెడ్డి బాధ్యతలు
రంగారెడ్డి - ప్రభాత సూర్యుడు
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా (రెవెన్యూ) కె. చంద్రా రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కొంగరకలాన్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏఓ సునీల్ కుమార్ అదనపు కలెక్టర్ కు స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా గతంలో అదనపు కలెక్టర్ గా పని చేసిన ఎం.వి.భూపాల్ రెడ్డి ఏసీబీ కేసులో అరెస్ట్ కావడంతో ఆయన స్థానంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ కు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ప్రతిమా సింగ్ సెలవులపై వెళ్లడంతో ప్రభుత్వం హెచ్ఎండీఎ బుద్దపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీగా పని చేస్తున్న కె.చంద్రా రెడ్డిని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ గా కె. చంద్రా రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.