79th Indipendent : ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన ధరణి డెవలపర్స్ సీఈఓ కంపే సైదులు

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన ధరణి డెవలపర్స్ సీఈఓ కంపే సైదులు
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వనస్థలిపురంలోని ధరణి డెవలపర్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధరణి డెవలపర్స్ సంస్థల సీఈఓ కంపే సైదులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ..ధరణి మార్కెటింగ్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ధరణి సంస్థ ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలో ధరణి ఆధ్వర్యంలో 79వ సంవత్సర దినోత్సవ వేడుకలను నిర్వహించడం సంతోషకరమని, మళ్లీ వచ్చే 80వ స్వాతంత్ర దినోత్సవం వరకు ప్రతిఒక్క మార్కెటింగ్ సిబ్బంది ఆర్థిక స్వాతంత్రం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మోహన మూర్తి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈర్ల చంద్రం, మార్కెటింగ్ సిబ్బంది చెరుకు ఉపేందర్, కే మల్లేష్, బి వెంకటేష్, పి నాగరాజు, జి బాలకృష్ణ, జి సురేష్, ఎం వెంకట్, భీముడు నాయక్ తదితరులు పాల్గొన్నారు.