DM&HO RRD : మెడికల్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

మెడికల్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
రంగారెడ్డి - ప్రభాత సూర్యుడు
నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్ సి) లో 21 మెడికల్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని రంగారెడ్డి జిల్లా మెడికల్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఒక సంవత్సర కాలపరిమితి కలిగిన పోస్టులకు దరఖాస్తులను అర్హత కలిగిన అభ్యర్థులు 18. 07. 2025 లోగా బయోడేటా తో సెల్ఫ్ అట్టేస్డ్డ్ తో కూడిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను రంగారెడ్డి జిల్లా మెడికల్ అధికారి కార్యాలయానికి పోస్టులో పంపాలని కోరారు. దరఖాస్తు ఫాములు మరియు నియమ నిబంధనలు www.rangareddy.telangana.gov.in. అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
Click Here to Read More👉 Adhinetri Work Shop : త్వరలో అధినేత్రి వర్క్ షాప్
Views: 57