TTD Updates : టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెన్షన్

టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెన్షన్
తిరుపతి - ప్రభాత సూర్యుడు
టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయడం జరిగింది.
Click Here to Read More👉 Lashkar Bonalu : నేటి నుంచి ఆషాఢ మాసం బోనాలు
తిరుపతి జిల్లా పుత్తూరులోని స్వగ్రామంలో రాజశేఖర్ బాబు ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని సమాచారం . ఈ వ్యవహారంతో టీటీడీ ఉద్యోగిగా ఆయన సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగింది .
ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది.
Views: 7
Related Posts
Latest News
08 Jul 2025 22:49:29
త్వరలో అధినేత్రి వర్క్ షాప్ హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు మహిళలకు నాయకత్వ ప్రతిభను మరింత పెంపొందించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో...