CEO : ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి
ఈవీఎంల భద్రతే ప్రధాన కర్తవ్యం - రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి

ఈవీఎంల భద్రతే ప్రధాన కర్తవ్యం
- రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి
రంగారెడ్డి - ప్రభాత సూర్యుడు
రాష్ట్రంలోని అన్ని జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో ఈవీఎం భద్రతకు అదనపు భవనాలను నిర్మించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిని సూచించారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని రాజేందర్ నగర్ ఈవీఎం గోడౌన్స్ నందు భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని గదులను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి. సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భాంగా సీఈఓ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పునర్విభజనలో భాగంగా భవిష్యత్తులో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య పెరగనున్నందున ఈవీఎంలు భద్రపరిచేందుకు అదనపు భవనం నిర్మించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు సీఈవో సుదర్శన్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్, త్వరలో కొత్త భవనం నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలోరాజేందర్ నగర్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి, తహశీల్దార్, వేర్ హౌస్ ఇంచార్జీ బొమ్మ రాములు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.