ACB Rides : 8000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యండ్ గా పట్టుబడ్డ టాక్స్ ఆఫీసర్ సుధ

మాదాపూర్‌లో రూ. 8,000 లంచం తీసుకుంటూ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ అరెస్ట్
హైదరాబాద్ - ప్రభాత సూర్యడు
జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం రూ. 8,000 లంచం తీసుకుంటూ మాదాపూర్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ ఎం. సుధా, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కంపెనీకి సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి టాక్స్ ఆఫీసర్ సుధా రూ. 8,000 లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సోమవారం, లంచం తీసుకుంటుండగా సుధాను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితురాలు సుధాపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనకు ఏసీబీ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసింది.
Click Here to Read More👉 Kavitha Liquor Scam : ఈడీ సైలెంట్ ఆపరేషన్.. లిక్కర్ స్కామ్‌లో అసలు ప్రకంపనలు స్టార్ట్
Views: 2
Latest News
08 Jul 2025 22:49:29
త్వరలో అధినేత్రి వర్క్ షాప్ హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు మహిళలకు నాయకత్వ ప్రతిభను మరింత పెంపొందించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో...