EAGLE : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 'హైడ్రా'లాంటి మరో వ్యవస్థ

On
EAGLE : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 'హైడ్రా'లాంటి మరో వ్యవస్థ

సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 'హైడ్రా'లాంటి మరో వ్యవస్థ.. అలాంటి వారికి నిద్రలేని రాత్రులే..!

హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు 'ఈగల్ వ్యవస్థ'ను ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఈగల్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. 

Click Here to Read More👉 No Traffic Rules : మేము రూల్స్ పెడతాం..పాటించం..!

ఈ ప్రత్యేక బృందంలో శిక్షణ పొందిన గద్దలు డ్రగ్స్, గంజాయి ఆనవాళ్లను పసిగడతాయని చెప్పారు.

Click Here to Read More👉 Sefety In Private Schools : ప్రైవేటు బడుల్లో విద్యార్థులు భద్రమేనా..?

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ

Click Here to Read More👉 Buy Back Scam : రియల్ ఎస్టేట్ మోసం

ప్రత్యేకంగా ఈగల్ టీం

సీఎం రేవంత్ కీలక నిర్ణయం.

తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలన అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటికే వందల నిర్మాణాలు నేలమట్టం చేశారు. హైడ్రా పేరు చెబితేనే అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా హైడ్రా లాంటి మరో కొత్త వ్యవస్థను తెలంగాణ సర్కార్ తీసుకొచ్చింది. తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చే దిశగా కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు పటిష్టమైన 'ఈగల్ వ్యవస్థ'ను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే సందర్భంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగల్ వ్యవస్థ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ యువత పోరాట పటిమను గుర్తుచేశారు. దేశంలో తెలంగాణ యువతకు ప్రత్యేక స్థానం ఉందని.. దేని మీద అయినా పోరాటం మొదలు పెడితే.. సాధించేవరకూ తెలంగాణ యువత నిద్రపోదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఇందుకు నిదర్శనమని అన్నారు. అలాంటి యువత డ్రగ్స్‌కు బానిస కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మినా.. కొనుగోలు చేసినా కఠినంగా శిక్షిస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు. నార్కోటిక్ బ్యూరోను ఇకపై 'ఈగల్'గా పిలుస్తామని.. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటుందన్నారు. ఈ ప్రత్యేక టీంలో శిక్షణ పొందిన గద్దలు ఉంటాయని.. తెలంగాణ భూభాగాన్ని నిత్యం జల్లెడ పడతాయన్నారు. గంజాయిని గమనించినా.. డ్రగ్స్ ఆనవాళ్లను పరిశీలించినా.. క్షణంలోనే పట్టేస్తాయన్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై, వినియోగదారులపై నిరంతరం నిఘా ఉంచుతామని ఇక నుంచి వారికి నిద్రలేని రాత్రులేనని అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి సమూలంగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. ఈగల్ వ్యవస్థ డ్రగ్స్ నెట్‌వర్క్‌లను పసిగట్టి.. వేగంగా చర్యలు తీసుకుంటుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న డ్రగ్స్ నియంత్రణ చర్యలను అభినందించారు. రైజింగ్ తెలంగాణ స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వానికి తమ పూర్తి తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. యువ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే వార్ అవసరం లేదని.. యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలని అన్నారు. డ్రగ్స్ అలవాటు చేసే వారికి దూరంగా ఉండాలని, డ్రగ్స్ జీవితాల్ని నాశనం చేస్తాయని యువతకు పిలుపునిచ్చారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

Views: 65

Latest News

EAGLE : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 'హైడ్రా'లాంటి మరో వ్యవస్థ EAGLE : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 'హైడ్రా'లాంటి మరో వ్యవస్థ
సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 'హైడ్రా'లాంటి మరో వ్యవస్థ.. అలాంటి వారికి నిద్రలేని రాత్రులే..! హైదరాబాద్ – ప్రభాత సూర్యుడు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు...
Sefety In Private Schools : ప్రైవేటు బడుల్లో విద్యార్థులు భద్రమేనా..?
Lashkar Bonalu : నేటి నుంచి ఆషాఢ మాసం బోనాలు
Bhu Bharathi : భూ సమస్యల దరఖాస్తులపై సర్కార్ దిమ్మతిరిగే కీలక నిర్ణయం..!!
Kavitha Liquor Scam : ఈడీ సైలెంట్ ఆపరేషన్.. లిక్కర్ స్కామ్‌లో అసలు ప్రకంపనలు స్టార్ట్
Buy Back Scam : రియల్ ఎస్టేట్ మోసం
Lok Sabha : అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 20 శాతం పెంపు