No Traffic Rules : మేము రూల్స్ పెడతాం..పాటించం..!

నిబంధనలన్నీ..సామాన్యులకే..! పోలీసుల పాటించరు.. బడాబాబులకు, రాజకీయనాయకులకు వర్తించవు

On
No Traffic Rules : మేము రూల్స్ పెడతాం..పాటించం..!

హెల్మెట్ఉండికూడా ధరించకుండా బోడుప్పల్ నుండి మాణిక్ చంద్ రోడ్ మార్గంలో నిర్లక్షంగా ద్విచక్ర వాహనాన్న నడుపుతున్న ట్రాఫిక్ పోలీస్

మేము రూల్స్ పెడతాం..పాటించం..!

  • నిబంధనలన్నీ..సామాన్యులకే..!
  • పోలీసుల పాటించరు.. బడాబాబులకు, రాజకీయనాయకులకు వర్తించవు
  • సామాన్యుడు కరెంటు బిల్ కట్టకపోతే కరెంట్ కట్.. బడాబాబుల జోలికి వెళ్ళరు
  • మంచినీటి బిల్లు కట్టకుంటే నీళ్ళు బంద్..వారి నో ఫరక్
  •  ఇంటి పన్ను కట్టకుంటే..ఇంటికి తాళం
  •  సామన్యుడు ఇళ్ళు కట్టుకుంటే..నో పర్మిషన్ అంటూ వేధింపులు
  •  పర్మిషన్ ఉన్నా..నిబంధనలకు విరుధ్దం అంటూ వేధింపులు
  •  ఇలా ఎలాంటి రూలైనా పేదోడికే..మద్యతరగతి సామన్యుడుకే..

కోట దామోదర్✍️ (మొబైల్ 9391480475)
కాలమిస్ట్ - ప్రభాత సూర్యుడు

ప్రభుత్వాలు ప్రవేశపెట్టే నిబంధనలు సామాన్యులకు, పేదలకేగాని.. ధనికులకు, పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు వర్తించవనేది జగమెరిగిన సత్యం.
రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు వాటన్నింటికీ అతీతులే !.  అందుకు నిదర్శణం ఈ తాజా చిత్రం. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి.  జూన్ 2005, 04వ తేదీ నాడు ఉదయం హైదరాబాద్ లోని బోడుప్పల్ నుండి మాణిక్ చంద్ రోడ్ మార్గంలో వెళ్తున్న సందర్భంలో కనిపించిన దృశ్యం. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నపుతున్నాడు ఉండి కూడా. హెల్మెట్ లేకపోతే లేదేమోలే.. మర్చిపోయాడేమో అని అనుకోవచ్చు కానీ, హెల్మెట్ ఉండి కూడా వాహనానికి తగిలించి నేనే ట్రాఫిక్ పోలీసును, నన్నెవడెంచేస్తాడులే..అన్న రీతిలో నిర్లక్ఝంగా వాహనాన్ని నడుపుడున్నాడు. అంతేలే.. ట్రాఫిక్ చాలన్లు వేసేది వారే కదా..! వారికి వేసేది ఎవ్వరులే..!Screenshot 2025-06-07 222902ఒక సామాన్యు వాహనదారుడు హెల్మెట్ లేకుండా రోడ్ మీద వెళ్తే పట్టుకొని బలవంతంగా బండి తాళాలు లాక్కొని ఫైన్ వేసి ఇబ్బందులకు గురిచేస్తున్న సందర్భాలు కోకొల్లలు అంతేకాదు మరి కొందరైతే 50 - 100 రూపాయలకు ఆశపడి డబ్బులు తీసుకొని వదిలేసే అధికారులు కొంతమంది. సామాన్యుడు ఫైన్ కట్టని పరిస్థితిలో బండి లాక్కొని నానా ఇబ్బందులకు గురిచేస్తారు తప్ప వదిలేసే పరిస్థితి చాల తక్కువ. కారు సీటు బెల్ట్ పెట్టకోకపోతే ఫైన్, సిగ్నల్ జంప్ పేరుతే ఫైన్, ఎక్కవ మాట్లాడితే పోలీసు విధులకు ఆటకం అని ఫైన్. ఇవన్నీ సామాన్యులకే. మాకు కాదు. ఉండవు కూడా.traffic-380x214అదే రాజకీయ నాయకులు పోలీస్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించినా అడిగే నాథుడు ఉండడు, ఎందుకంటే సామాన్య ప్రజలకు భయమని కాదు సామాన్యుడిలో ఉండే సంస్కారం.  అంతేకాదు పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టినా ఊరుకుంటారు. కాని సామాన్యుడు కరెంటు బిల్లు సకాలంలో కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారు. బడా వ్యాపారులకు రాయితీలు ఇస్తారు. సామాన్యులపై పన్నుల భారం మోపుతారు. కాని సామాన్యులు చిన్న నిబంధన ఉల్లంఘించినా నానా రచ్చ చేస్తారు. మన దేశంలో పెద్దలు ఏం చేసినా చెల్లుతుంది. వారు పెట్టుకున్న నిబంధనలు వారే పాటించరు. వారు చేసే చట్టాలు సామాన్యులు అనుసరించడానికి తప్ప వారికి వర్తించవు.Screenshot 2025-06-07 222812పోలీస్ అధికారి బండి నడపడం తప్పు కాదుకానీ ఆయన హెల్మెట్ పెట్టకపోవడమే తప్పు. మనం సామాన్యులమైన తప్పును తప్పే అని తీరాల్సిందే. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రోడ్ల మీద పోయే ప్రతిఒక్కరు తమ రక్షణకొరకు హెల్మెంట్ పెడుతున్నారో లేదో తెలియదు గాని మీ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలనే నిబద్దతతో హెల్మెంట్ వాడుతున్నారు. కాబట్టి పోలీస్ అధికారులు కూడా నిబద్దతతో హెల్మెట్ వాడాలనేది ఒక సామాన్యుడిగా నా ప్రశ్న.

Read More Indiramma Indlu : దసరా నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోండి

  • హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న పోలీసుపై పోలీసు అధికారులు ఎలాంటి చర్యులు తీసుకుంటారో..లేక లైట్ తీసుకుంటారో చూద్దాం.
Views: 62

Latest News