KTR vs Kavitha: ఎమ్మెల్సీ కవితకు షోకాజ్ నోటీసులు❓
పార్టీ అంతర్గత వ్యవహారాలను మాట్లాడినందుకు కెసిఆర్ సీరియస్

ఎమ్మెల్సీ కవితకు షోకాజ్ నోటీసులు❓
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
బిజెపిలో టిఆర్ఎస్ పార్టీని విలీనియం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఎమ్మెల్సీ కవిత ఇవ్వాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు బిఆర్ఎస్ హై కమాండ్ సిద్దమైనట్టు తెలుస్తుంది.
పార్టీలోని నేతలపై విమర్శలు చేసినందుకు, అంతర్గత వ్యవహారాల గుర్తించి మాట్లాడినందుకు మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నట్టు సమాచారం అందుతోంది. కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ అవ్వడం, ఆమెపై సోషల్ మీడియాలో దాడి జరగ డంతో కవిత మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ చిట్ చాట్‌లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించా రు.తాను తన తండ్రికి ఎన్నిసార్లైనా లేఖలు రాస్తానని అడగడానికి మీరెవరు అంటూ కేటీఆర్‌పై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన లేఖను ఎవరు లీక్ చేశారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తనకు కేసీఆర్ ఒక్కరే బాస్ అని స్పష్టం చేశారు. తనపై జైలుకు వెళ్లిన నాటి నుండి కుట్ర జరుగుతోందని అన్నారు. తనపై తప్పుడు వార్తలువ వస్తే బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పార్టీ వాళ్లే సోషల్ మీడియాలో తనపై టార్గెట్ చేశారని ఆరోపించారు.
వీటితో పాటూ కవిత మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు ఇవ్వనుంది అనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ షోకాజు నోటీసులు ఇస్తే కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
Latest News
