Ibrahimpatnam Constituancy : ఎమ్మెల్యే మనుషలమంటూ స్థానిక నాయకుల అక్రమ నిర్మాణాలు ?

అనుమంతులు లేకుండానే భారీ షెడ్డులు, వ్యాపార సముదాయాలు

On
Ibrahimpatnam Constituancy : ఎమ్మెల్యే మనుషలమంటూ స్థానిక నాయకుల అక్రమ నిర్మాణాలు ?

పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కార్యాలయం (ఫైల్ ఫోటో)

విచ్చల విడిగా అక్రమ నిర్మాణాలు

  • ఎమ్మెల్యే మనుషలమంటూ స్థానిక నాయకుల అక్రమ నిర్మాణాలు ?
  • అనుమంతులు లేకుండానే భారీ షెడ్డులు, వ్యాపార సముదాయాలు
  •  అనుమతులున్నా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు
  •  తీసుకునేది ఇంటి నిర్మాణ అనుమతులు..నిర్మించేది భారీ షెడ్లు
  •  టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం.. చేతివాటం ప్రదర్శిస్తున్న క్రింది స్థాయి సిబ్బంది

ఇన్వెస్టిగేషన్ డెస్క్ - ప్రభాత సూర్యుడు

నగర శివారు పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏకంగా ఎమ్మెల్యే మనుషులంమటూ..స్థానిక ఎమ్మెల్యే పేరు బద్నాం చేస్తూ.. కొందరు స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు అక్రమ నిర్మాణాల జోరు కొనసాగిస్తున్నారు. కౌన్సిల్ పదవీ కాలం ముగియడం, అధికారుల పర్యవేక్షణ లోపం, పూర్తి స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులు లేకపోవడం కారణంగా మున్సిపాలిటీ పరిధిలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇదే అదనుగా మున్సిపాలిటీలోని కొందరు క్రింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సమాచారాన్ని అధికారుల వరుకు రాకుండా గోప్యత ప్రదర్శిస్తూ..అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారు. దీంతో పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతే లేకుండా పోయింది. ఫలితంగా మున్సిపాలిటీ ఆదాయాకి భారీ గండి పడుతుంది.WhatsApp Image 2025-06-07 at 9.25.40 PM

Read More Suryapet News Update : రాత్రి వేళల్లో గేదెలను రోడ్డపైకి వదిలితే కఠిక చర్యలు

12వ వార్డు అంజనాద్రి నగర్ మెయిన్ రోడ్డులోని డబుల్ బెడ్రూంల ప్రక్కన నిర్మించిన అక్రమ షెటర్లు

Read More Telangana Cabinet : 6 మంత్రి పదవుల్లో ముగ్గురికి బెర్త్ కన్షామ్.. 3 పెండింగ్

ఎమ్మెల్యే మనుషులంమంటూ..అక్రమ నిర్మాణాలకు తెర

Read More Ibrahimpatnam constituency : ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు 

మున్సిపాలిటీ పరిధిలో కొన్ని వార్డులలో కొందరు స్థానిక తాజా మాజీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రేస్ నాయకులు అక్రమ నిర్మాణలకు తెరతీస్తున్నారు. మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతూ.. అనుమతులు లేకుండానే భారీ షెడ్లు, బహుళ వ్యాపార సముదాయ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కొందరు తాజా మాజీలు దొరికినకాడికి దోచుకొని రాజకీయ పలుకుబడితో అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు నోటీసులిస్తే..వెంటనే రంగంలోకి దిగుతారు. అవన్నీ తమకు చెందినవారివని, తాము ఎమ్మెల్యే అనుచరులంటూ అధికారులను బెంబేలేత్తిస్తున్నారు. చేసేదేమిలేక అధికారులు నోటీసులతోనే సరిపెడుతున్నారు. ఎవరైనా పిర్యాదుచేస్తే ఇవే విషయాలను స్వయంగా అధికారులే వివరించడంతో పిర్యాదుదారులు ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది. తప్పని పరిస్థితుల్లో కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోవడంలేదు మున్సిపల్ అధికారులు. WhatsApp Image 2025-06-08 at 3.10.42 AM

1వ వార్డు రాజీవ్ గృహకల్ప శివపార్వతుల బొమ్మ దగ్గర అనుమతుల పేరిట ఓక తాజా మాజీ ప్రతినిధికి చెందిన భారీ షెడ్ నిర్మాణం (ఫైల్)

అనుమతులొకటి..నిర్మాణాలు మరొకటి..!

గృహ నిర్మాణాలను మినహాయిస్తే పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నవన్నీ దాదాపుగా అక్రమ నిర్మాణాలే. ఇంటి నిర్మాణ అనుమతులు పొంది భారీ షెడ్లను, బహుళ వ్యాపార సముదాయాలను ( మడిగెలు) నిబంధనలకు విరుధ్దంగా నిర్మిస్తున్నారు. ఇవన్నీ కండ్లముందే జరుగుతున్నా రాజకీయ ఒత్తిల్లకు తలొగ్గి అధికారులు అటువైపు కన్నేత్తి చూడరు.  పిర్యాదులొస్తే అనుమతులున్నాయని దాటవేస్తారు. నిర్మాణాలు ఎవైతేనేం..ప్రభుత్వాని డబ్బులు వస్తున్నాయిగా అంటూ అధికారులే గర్వంగా చెప్తుండడం విస్మయానికి గురుచేస్తున్న అంశం. 

మచ్చుకు ఒకటి, రెండు పరిశీలిస్తే..పెద్ద అంబర్ పేట్ కేంద్రంలోని 5వ వార్డు విజయవాడ జాతీయ రహదారిపై గత కొంత కాలం క్రితం భారీ షెడ్ నిర్మాణాన్ని ( ప్రస్తుతం పిస్తా హౌజ్ రెస్టారెంట్ ) చేపట్టడంతో.. అధికారులకు పిర్యాదులు వచ్చాయి. అనుమతులు ఉన్నాయంటూ దాటవేశారు అధికారులు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే..ఆ భారీ షెడ్డుకు ఇంటి నిర్మాణ అనుమతులు ఉన్నట్లు తేలింది. అయితే, ఇంటి నిర్మాణ అనుమతులతో భారీ షెడ్ నిర్మాణం ఏంమిటని ప్రశ్నిస్తే.. ఏ అనుమతులైతేనేం.. అనుమతులున్నాయా.. లేవా అంటూ ఎదురు ప్రశ్నించారు అదికారులు. అయినా ఆ నిర్మాణం స్థానిక ఎమ్మెల్యే బందువుదని, ఓ తాజీ మాజీ కౌన్సిలర్ కుటుంబ సభ్యులదని అధికారులే చెప్పడం విడ్డూరంగా ఉందని పిర్యాదుదారుడు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. WhatsApp Image 2025-06-08 at 2.53.07 AM

5వ వార్డు విజయవాడ జాతీయ రహదారిలో అనుమతుల పేరిట అక్రమంగా నిర్మించిన పిస్తా హౌజ్ భవనం (ఫైల్ ఫోటో )

మరోకటి పరిశీలిస్తే..తాజాగా 4వ వార్డు బలిజగుడ రోడ్డులో అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు (మడిగెలు) నిర్మిస్తున్నారు. పిర్యాదు అందిన వెంటనే అధికారులు మొక్కుబడిగా పనులు ఆపడంతో.. స్థానిక మాజీ ప్రజా ప్రతినిధి హుటా హుటిన అధికారులను కలిసినట్లు పక్కా సమాచారం. ఆ మడిగెలు తమవేనని..తాము ఎమ్మెల్యే అనుచరులం అని చెప్పడంతో అధికారులు తొక ముడిచారు. రాజకీయ పలుకుబడితో బాజాప్తుగా అక్రమార్కులు అక్రమ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభానికి సిధ్దం చేసుకున్నారు. ఇక దానిపై అధికారుల చర్యలు మాత్రం శూన్యంగా మిగిలాయి.WhatsApp Image 2025-06-07 at 9.25.39 PM

4వ వార్డు బలిజగుడ రోడ్డులో ఎమ్మెల్యే అనుచరులమని అక్రమంగా నిర్మించిన మడిగెలు

ఈ విధంగా చెప్పుకుంటూ పోతె..పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో గత సంవత్సన్నర కాలంగా అక్రమ నిర్మాణాలకు అడూ..అదుపూ లేకుండా పోతుంది. వీటన్నింటిని అరికట్ట వలసిన అధికారులు కాసులకు, రాజకీయ వత్తిడులకు తలొగ్గి అలసత్వం వహిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పూర్తి స్థాయిలో ( అన్ని పని రోజులు విధులకు కేటాయించకం పోవడం ) అధికారులు లేకపోడంతో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాదన. దీన్ని ఆసరాగా చేసుకొని వార్డు ఆఫీసర్లు మరియూ టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరనీయకుండా అన్నీ తామై వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.WhatsApp Image 2025-06-07 at 9.25.40 PM (1)

కుంట్లూరు-పెద్ద అంబర్ పేట్ రోడ్డులో నారాయణ కాలేజీ ఎదురుగా రోడ్డును ఆక్రమించి చేపట్టిన అక్రమ షెడ్

పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ అవినీతి అధికారులపై, సిబ్బందిపై వస్తున్న పిర్యాదుల, ఆరోపణల మేరకు.. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కార్యాలయంలోని రెవెన్యూ, సానీటరీ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, అకౌంట్స్ ఇతర విభాగాలు మరియూ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలన్నింటిని ఆధారాలతో ఒక్కొక్కటిగా త్వరలో బయట పెట్టేందుకు ప్రభాత సూర్యుడు సిద్దంగా ఉంది.

ప్రభాత సూర్యుడు
నిజం దాగదు..వార్త ఆగదు

Views: 104

Latest News