TPCC : మల్రెడ్డి రంగారెడ్డికి చెక్..? స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మంత్రివర్గంలో బెర్త్..!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రి పదవి

Telangana Speaker Gaddam Prasad vs MLA Malreddy Rangareddy
మల్రెడ్డి రంగారెడ్డికి చెక్..? స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మంత్రివర్గంలో బెర్త్..!
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రి పదవి
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రి పదవి వరించనుందా.... ? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలో ముగ్గురిలో ఒకరూ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ప్రకటన రావాల్సి ఉంది. గతంలో మంత్రిగా సేవలు అందించిన అనుభవం అధిష్టానం పెద్దలతో స్పీకర్ కు ఉన్న అనుబంధం మంత్రి పదవి తప్పకుండా వస్తుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో సీనియర్ గా ఉన్న ప్రసాద్ కుమార్ కు మంత్రి పదవి ఇస్తేనే పార్టీకి అంత అనుకూలంగా ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముగ్గురు మంత్రుల పేరు ప్రకటించే వారకు వేచిచూడాల్సిందే.