MLA Gandra Satyanarayana Rao : ఆర్ఎంపీ డాక్టర్ల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర
ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం మండలం ఆర్ఎంపీ డాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్రలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఆపరేషన్ సిందూర్ కు ఆర్.ఎం.పి డాక్టర్ల మద్దతుగా ప్రదర్శన
- ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం - ప్రభాత సూర్యుడు
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిధ దళాల సారధ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు సోమవారం గణపురం మండల కేంద్రంలోని ఆర్ఎంపి,పిఎంపి సంఘ నాయకులు మండల ప్రజా ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని అంగడి నుండి ఎన్టీఆర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహాల్గాం లో గత నెలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశానికి చెందిన 26 మంది అమాయక పర్యాటకులను అతి కిరాతకంగా కాల్చి చంపిన నేపథ్యంలో దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను వారి స్థావరాలను నేలమట్టం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కనువిప్పు చర్యలను మన దేశ త్రివిధ దళాలకు చెందిన సైనికులు పెద్ద ఎత్తున సమర్థవంతంగా తిప్పి కొట్టడం జరిగిందని అందులో భారత సైనికులు మరణించడం బాధాకరమని వారు అన్నారు. దేశ త్రివిధ దళాల పోరాటానికి సంఘీభావంగా జయహో ఆపరేషన్ సింధూర్ జై జవాన్ జై భారత్ భారత్ మాతాకీ జై వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ప కాల్పుల్లో అమరులైన వారిని గుర్తు చేసుకుంటూ అమరహే అమరహే అంటూ ఆర్ఎంపి పి.ఎం.పి సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నినదించారు. భారత త్రివిధ సైనిక దళాలు కనువిప్పు చర్యలను తిప్పికొట్టేందుకు ఆహార నిశలు పాటుపడుతున్న నేపథ్యంలో దేశం యావత్తు వారి వెంట నిలుస్తుందని పేర్కొన్నారు.