Operation Sindoor : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే మరీ..! మోడీనా..మజాకా..
అమెరికా కెఏ పాల్ గా ట్రంప్, అడుక్కుతినే దుస్థితికి పాక్

శాంతి మంత్రాలకు చింతకాయలు రాలవు !
శాంతి మంత్రాలకు చింతకాయలు రాలవు !
ప్రభాత సూర్యుడు వెబ్ డెస్క్
భారత్‌తో యుద్దం గెలిచామని తమ సొంత ప్రజలను నమ్మించేందుకు పాక్ చేయని ప్రయత్నం లేదు. చివరకు విజయోత్సవాలను కూడా నిర్వహించుకుంది. ట్రంప్ కూడా తన వల్లనే యుద్దం ఆగిందని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచార కండూతి ఇద్దరిలోనూ కనిపిస్తోంది. అయితే ఇందులో ఏది నిజమో భారత్‌ను చూస్తే తెలుస్తుంది. పాక్ ఎందుకు కాళ్ల బేరానికి వచ్చిందో చెప్పాలి. ప్రపంచాన్ని బెదిరించి పబ్బం గడుపు కునే దుస్థితిలో ట్రంప్ ఉన్నారు. అడుక్కుతినే దుస్థితిలో పాక్ ఉంది. పాక్ ముందు నుంచి నిజాయితీ ఉన్న దేశంగా పేరు సంపాదించుకోలేదు. యుద్ధాన్ని తానే ఆపానని ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేసుకుం టుంటే...మరో వైపు పాకిస్తాన్ తామే యుద్ధంలో గెలిచామని ప్రచారం చేసుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్‌లు చేసుకుంటున్న ప్రచారంపై అమెరికాతో సహ ప్రపంచ దేశాలు నివ్వెరపోయి చూస్తున్నాయి. భారత్ దెబ్బకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిన పాక్..నిజాయితీగా బతకాలన్న ఆలోచన చేయడం లేదు. https://youtu.be/TdfMJVqmh8k
ఇండియా పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం కాల్పులు మొదలైన మూడు రోజులకే ముగిసిన సంగతి తెలిసిందే. ఎందుకు ముగిసాయన్నది పాక్‌కు బాగా తెలుసు. భారత్ కొట్టిన దెబ్బకు పాక్ కూసాలు కదిలిపోయాయి. మిస్సైల్స్, డ్రోన్ల దాడి కారణంగా భారీ ఆస్తినష్టం సంభవించింది. ఒకరకంగా పాక్‌పై కోలుకోలేని దెబ్బ పడిరది. యుద్ధం ఇలాగే కొనసాగితే దేశం సర్వ నాశనం అవుతుందని పాక్ భావించింది. వెంటనే కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సాయంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో కాల్పుల కొనసాగింపు ఆగిపోయింది. అయితే భారత్ మాత్రం ఆపరేషన్ సింధూర్ నిలిచి పోయిందని, ఎప్‌ఉడైనా కొనసాగుతుందని గట్టిగా హెచ్చరించింది. మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తరవాత దేశంతో పాటు, ప్రపంచానికి కూడా భారత్ సత్తా ఏమిటో మరోమారు తెలిసిపోయింది.
ఇండియా దెబ్బకు తోకుముడిచిన కుక్కలా పాకిస్తాన్ బిక్కచచ్చిపోయింది. దాడులు, కాల్పుల విరమణ కోసం పరుగులు తీసింది. యుద్ధంలో పాకిస్తాన్ దారుణంగా దెబ్బతింది. ఇండియా డిప్లమేటిక్‌గా.. మిలటరీ పరంగా విజయం సాధించింది. ఇండియా ఎందుకు విజయం సాధించిందనే దానికి పటిష్టమైన నాయకత్వం, మిటిటరీ ఆధునీకరణ అని చెప్పక తప్పదు. గత కొన్ని వేల సంవత్సరాలుగా పరాయి పాలనలో మగ్గిన భారత్ స్వయం సమృద్ది సాధించి, సైనికంగా బలోపేతం అయ్యింది. ఎదుటి వారు దాడిచేస్తే దెబ్బ కొట్టాల్సిందేనన్న లక్ష్యంతో పనిచేస్తోంది. చెంపకుచెంప కాదు...కాల్లు విరగ్గొడతామన్న ధైర్యాన్ని చూపిస్తోంది. ఈ విషయం పాకిస్తాన్‌కే బాగా తెలుసు. వరుసగా ఉగ్రదాడులతో భారత్‌ను దెబ్బకొట్టాలని చూసిన పాక్ ఇప్పుడు దెబ్బతింది. ఇక జీవితంలో మరువలేని అనుభవాన్ని సంపాదించింది. ఇకనుంచి ఉగ్రదాడులకు దాడులతోనే భారత్ సమాధానం చెబుతుందన్న విషయం ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
ఇకపోతే ఇప్పుడు అందరి చూపు.. పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న విషయం వైపే ఉంది. టెర్రరిస్టులు చనిపోయినపుడు ఆర్మీ అధికారులు యూనిఫామ్‌లో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంటే దానర్థం.. అక్కడి టెర్రరిస్టులకు.. ఆర్మీ వాళ్లకు తేడా లేదని. పాక్ చరిత్ర గురించి బాగా తెలిసిన వారు..ఈ రెంటికీ విడదీయరాని సంబంధం ఉందని గుర్తించారు. ఇండియాతో యుద్ధం చేసి ఓడిపోయిన ప్రతీసారి తామే గెలిచామని పాకిస్తాన్ జబ్బలు చరుచుకుంటోంది. అందుకే ఉగ్రవాదులకు ఊతమిచ్చే చర్యలను పక్కన పెట్టి పాకిస్తాన్ తన సొంత ఇంటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బంగ్లా యుద్దంనాటి 1971తో పోల్చితే మన దేశం ఆర్థికంగా ఎన్నో రెట్లు బలపడిరది. మన సైనిక శక్తి పాటవాలు కూడా అనేక రెట్లు పెరిగాయి. అందుకే డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్ దాడులు చేసినప్పటికీ సమర్థంగా తిప్పి కొట్టాం.
అలాగే ప్రతిదాడితో దాని పక్కటెముకలను విరగొట్టాం. మనవైపు చెప్పుకోదగిన నష్టం ఏవిూ జరగలేదు. అంతర్జాతీయ సవిూకరణాలు... 1971లో పాక్‌కు దన్నుగా అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాలు నిలవగా... మన దేశానికి సమైక్య రష్యా మాత్రమే అండగా ఉండిరది. ఇప్పుడు వాతావరణం మారింది. భారత్ శాస్త్ర సాంకేతికరంగంలో దూసుకు పోతోంది. భారతదేశం కూడా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. దీంతో భారత్ నుంచి ముప్పు తప్పదని భావించిన చైనా మనతో శత్రుత్వం పెంచుకుంటోంది. చైనాకు సామంత దేశంగా ఉండటానికి భారత్ ఎప్పటికీ అంగీకరించదు. ఈ కారణంగా చైనా వ్యూహాత్మకం గా పాకిస్థాన్‌ను చేరదీస్తోంది. దాయాది దేశానికి వివిధ రూపాల్లో సహాయం చేస్తోంది. మొన్నటికి మొన్న కూడా సైనికి సాయం చేసి భంగపడిరది. అందుకే అరుణాల్ విషయంలో పేచీలు పటెట్‌ఇ కెలక్కుంటోంది. ఇక అమెరికా కూడా చైనా ఎదుగుదలను నిరోధించే క్రమంలో దానితో సై అంటోంది. భవిష్యత్తులో చైనాతో తలపడాల్సి వస్తే భౌగోళికంగా పాక్ భూభాగం అమెరికాకు కావాలి. ఈ కారణంగా ఉగ్రవాదంపై తమది రాజీ లేని పోరు అంటూనే అమెరికా దొడ్డి దారిన పాకిస్థాన్‌కు సహాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో సైనికపరంగా అత్యంత శక్తిమంతంగా ఉన్న రష్యా మాత్రమే ఎప్పటికైనా మనకు అంతో ఇంతో అండగా నిలవొచ్చు. పశ్చిమ దేశాలతో ఉన్న వైరం కారణంగా రష్యా కూడా చైనాకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించే పరిస్థితి లేదు. ఈ కారణంగానే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయం చేయవద్దని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు భారత్ విజ్ఞప్తి చేసినాడే వంద కోట్ల డాలర్ల సహాయం అందించడానికి అంగీకారం తెలిపింది. యుద్ధాలను భరించే స్థితిలో ప్రపంచ దేశాలు ఇప్పుడు లేవు. ఐదు దశాబ్దాల క్రితం పరిస్థితులు వేరు. అప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా లేవు.
1971 యుద్ధ సమయంలో అంతర్జాతీయ పరిణామాలు మన దేశ ప్రజలపై ప్రభావం చూపలేదు. ఇప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు, దిగుమ తులు కూడా పెరిగాయి. ఇప్పుడంతా అభివృద్ది, అర్థిక వృద్దిపైనే అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి. పాక్ ఇందుకు భిన్నంగా ఉగ్రవాదులను ఎగదోస్తోంది. ఇలా ఎంతకాలం చేసినా అది మనుగడ సాగించదని గుర్తిస్తే మంచింది. అలా అని పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పకుండా ఉండలేం. మన దేశంతో యుద్ధం చేసి నెగ్గలేని పాకిస్థాన్ ఉగ్ర మూకలను పెంచి పోషించి మనపైకి ఉసిగొల్పుతోంది. తృతీయ ఆర్థిక శక్తిగా ఎదగాలను కుంటున్న భారత్‌కు ఈ యుద్ధం ప్రతిబంధకమే అవుతుంది. అలా అని చేతులు ముడుచుకొని కూర్చోలేని స్థితి. కశ్మీర్ అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యాటకులను వారి భార్యల కళ్లెదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా మన దేశాన్ని పాకిస్థానే యుద్ధ రంగంలోకి లాగింది. పాముకు పాలు పోసి పెంచితే అది ఏదో ఒకరోజు మనల్నే కాటేస్తుంది. పాకిస్థాన్‌కు కూడా ఈ పరిస్థితి ఎదురవుతోంది.