Shilpa Shirodkar : "ముసి ముసి నవ్వుల లోన.. కురిసిన పువ్వుల వాన" పాట భామకు కరోనా
హీరో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోదరిని ఈ భామ

1992లో విడుదలైన మోహన్ బాబు బ్రహ్మ సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శిల్పా శిరోద్కర్ "ముసి ముసి నవ్వుల లోన కురిసిన పువ్వుల వాన" అనే పాటతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఆ తరువాత నాగార్జునతో ఖుదా గవా సినిమాలో నటించిన. తదనంతరం ఒక్కటి రెండు సినిమాల్లో నటించిన అవి విడుదలకు నోచుకోలేదు.
హీరో మహేష్ బాబు వదినకు కరోనా పాజిటివ్
మూవీ డెస్క్ – ప్రభాత సూర్యుడు
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ అక్క శిల్పా శిరోద్కర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ అక్క శిల్పా శిరోద్కర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు సోమవారం తన ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘ హల్లో పీపుల్.. నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మీరు జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి‘ అని పేర్కొన్నారు.
శిల్పా శిరోద్కర్ మోహన్ బాబు హీరోగా నటించిన 1992లో విడుదలైన బ్రహ్మ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలోని "ముసి మసి నవ్వుల లోన.." అనే పాట ఇప్పటికీ ప్రజల హృదయాల్లోనే చిరస్థాయిగా నిలిచిపోయింది.
.