Nani's The Paradise : 18 కోట్లకు ‘ది ప్యారడైజ్‘ ఆడియో రైట్స్
నాని కెరీర్‌లో ఒక సినిమా ఆడియో హక్కులకు ఇంత పెద్ద మొత్తం రావడం ఇదే మొదటిసారి

సరిగమకు "ది ప్యారడైజ్ "ఆడియో హక్కులు
సరిగమకు ది ప్యారడైజ్ ఆడియో హక్కులు
మూవీ డెస్క్ - ప్రభాత సూర్యుడు
హిట్ 3 తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో పాటలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరిగమ మ్యూజిక్ రూ. 18 కోట్లకు ‘ది ప్యారడైజ్‘ ఆడియో రైట్స్‌ని దక్కించుకున్నట్లు సమాచారం.
నాని కెరీర్‌లో ఒక సినిమా ఆడియో హక్కులకు ఇంత పెద్ద మొత్తం రావడం ఇదే మొదటిసారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా విడుదల కాకముందే ఆడియో హక్కులు ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవడం చిత్ర యూనిట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం తెలుగుతో పాటు- హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో వచ్చే ఏడాది (2026) మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం 1980ల కాలంలో హైదరాబాద్‌లో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు- సమాచారం. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది.