Ranga Reddy : ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు
తహసిల్దార్ బి. సుదర్శన్ రెడ్డి

బాట సింగారం గ్రామం సర్వే నంబర్ 10/95, 10/96 లోని ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సిబ్బంది
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు
- తహసిల్దార్ బి. సుదర్శన్ రెడ్డి
అబ్దుల్లాపూర్ మెట్ – ప్రభాత సూర్యుడు
ప్రభుత్వ భూములను కబ్జా చేసి రియల్ వ్యాపారాలు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ బి. సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని బాట సింగారం గ్రామం సర్వే నంబర్ 10/95, 10/96 లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా వెంచర్ చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను తహసిల్దార్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఇందిరా, సర్వేయర్ జ్యోతిలు సిబ్బందితో కలిసి శనివారం కూల్చివేసి, బోర్డును నాటారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయించి సామాన్య ప్రజలను మోసం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.