Samantha - Raj Nidimodu : రాజ్‌తో సమంత రెండో పెళ్ళి క్లారిటీ
రాజ్‌తో సమంత..సతీమణి శ్యామాలి పోస్ట్ వైరల్

తాజాగా సమంత తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్..నెట్టింట వైరల్
రాజ్‌తో సమంత..సతీమణి శ్యామాలి పోస్ట్ వైరల్
మూవీ డెస్క్ - ప్రభాత సూర్యుడు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితం గురించి రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంటోంది. ఎంతో ప్రేమించిన అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్‌గా ఉంటుంది సమంత. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోని హ్యాపి లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికి సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు, సినీ ప్రియులు కోరుకుంటున్నారు. అయితే కొద్ది రోజులుగా దర్శకుడు రాజ్ నిడిమోదుతో తరచు కనిపిస్తోంది సామ్.. ఎక్కడికి వెళ్లిన సమంత పక్కన రాజ్ ఉంటున్నాడు. దీంతో ఆమె వైవాహిక జీవితం పై నెట్టింట రూమర్స్ గట్టిగానే ప్రచారం అవుతున్నాయి. అయితే రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లి అయ్యింది. ఇలాంటి టైం లో తాజాగా సమంత తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.
ఇందులో రాజ్‌పై సమంత వాలినట్టుగా కనిపిస్తుంది. దీంతో ఈ వార్తలు మరింత పుంజుకున్నాయి. వారి బాండింగ్ రోజు రోజుకి బలపడుతుందిగా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటో సోషల్ విూడియాలో బాగా వైరల్ అయింది. అయితే తాజాగా రాజ్ సతీమణి శ్యామాలి తాజాగా ఎక్స్ వేదికగా ఒక సందేశాత్మక పోస్ట్ పెట్టింది.. ’నా గురించి ఆలోచించి, విని, మాట్లాడే వారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి నా గురించి రాసే వారందరికి ప్రేమ, ఆశీస్సులు పంపుతున్నా’ అనే పోస్ట్ ను ఆమె షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. కొంతకాలంగా ఎలాంటి పోస్ట్ షేర్ చేయని ఆమె ఉన్నట్టుండి ఇలాంటి సందేశం ఎందుకు షేర్ చేశారా? అని, ఆమె కచ్చితంగా సమంతని ఉద్దేశించే మాట్లాడుతూంది అని కామోంట్ లు విపడుతున్నాయి.