Bonalu Festivel : లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు

లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్న వేళ, ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలోనూ ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మహేష్ గౌడ్‌కు ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ దర్శనం కోసం విశేష ఏర్పాట్లు చేశారు. బోనాల ఉత్సవాల్లో ఆకట్టుకున్న పోతారాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పళ్లు, బ్యాండ్ మేళాలు, యువకుల కేరింతలు చేయగా..పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఖైరతాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్