Mahalaxmi Scheme : త్వరలో తెలంగాణ మహిళలకు ప్రతినెల 2,500

తెలంగాణ మహిళలు సిద్ధమా..? అకౌంట్ లోకి రూ. 2,500.. ఎప్పటి నుండి ప్రారంభం అంటే..

On
Mahalaxmi Scheme : త్వరలో తెలంగాణ మహిళలకు ప్రతినెల 2,500

తెలంగాణ మహిళలు సిద్ధమా..?

అకౌంట్ లోకి రూ. 2,500.. ఎప్పటి నుండి ప్రారంభం అంటే

హైదరాబార్ - ప్రభాత సూర్యుడు

Click Here to Read More👉 Bhu Bharathi : భూ సమస్యల దరఖాస్తులపై సర్కార్ దిమ్మతిరిగే కీలక నిర్ణయం..!!

మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం అందించే దిశగా కాంగ్రెస్ సర్కార్ సిద్ధం అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఎన్నికల్లో ఆరు గ్యారంటీల ద్వారా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేశారు. ఆ తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రారంభించారు. అనంతరం రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. తాజాగా రాష్ట్రంలోని మహిళల కోసం మరో పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

Click Here to Read More👉 DM&HO RRD : మెడికల్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం 

తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులనే చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు ప్రకటన చేశారు. అందులో భాగంగానే మహిళలకు ఆరు గ్యారంటీల రూపంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 18-55 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం అందించే దిశగా కాంగ్రెస్ సర్కార్ సిద్ధం అవుతోంది. ఈ మేరకు అధికారులు విధి విధానాలను రూపొందిస్తున్నారు.

Click Here to Read More👉 ACB Rides : 8000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యండ్ గా పట్టుబడ్డ టాక్స్ ఆఫీసర్ సుధ

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మహిళల ఖాతాల్లోకి రూ. 2,500 జమ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతులకు రైతు భరోసా నగదు జమ చేసిన ప్రభుత్వం.. మహిళలకు సైతం ఈ పథకాన్ని అమలు చేసి ఎన్నికల్లోకి వెళితే మరింత లాభసాటిగా ఫలితాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అధికారులు సెర్ప్, మెప్మా నుంచి మహిళల వివరాలను తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు.

Views: 126

Latest News

Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు  Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు 
కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు  విద్యార్ధినిపై అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించిన ఉపాధ్యాయులు ఆ వీడియో చూపిస్తూ విద్యార్థినిని వేధించిన వారి స్నేహితుడు  వెబ్ డెస్క్ - ప్రభాత...
Mahalaxmi Scheme : త్వరలో తెలంగాణ మహిళలకు ప్రతినెల 2,500
DM&HO RRD : మెడికల్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం 
MLC Kavitha : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి 
BJP Rajasingh : 11 సంవత్సరాల శ్రమకు దక్కిన గొప్ప గౌరవం
Indiramma Canteen : 5 రూపాయలకే కడుపు నిండా భోజనం
CEO : ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి