Prajapalana: కేసీఆర్ సర్కారులోని పెండింగ్ బిల్లులు రేవంత్ క్లియర్
గ్రామ పంచాయతీలకు భారీ ఊరట.. పెండింగ్ బిల్లులు క్లియర్...!!
~2.jpg)
గ్రామ పంచాయతీలకు భారీ ఊరట.. పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన సర్కార్...!!
హైదరాబాద్ — ప్రభాత సూర్యుడు
తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులను ఎట్టకేలకు సర్కారు మంజూరు చేసింది. ప్రధానంగా రూ.10 లక్షల లోపు బిల్లులు క్లియర్ చేసింది.
ఇందుకోసం బుధవారం మొత్తంగా ఒకే రోజున రూ.153 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికీ బిల్లులు అందక ఇబ్బందులు మాజీ సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు మొదలగు అనేక కార్యక్రమాలు విడతలుగా వారివారి సొంత డబ్బులతో చేపట్టారు.
చాలా కష్టపడి గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన సర్పంచుల బిల్లుల చెల్లింపుల్లో గత ప్రభుత్వం జాప్యం చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పెండింగ్ బిల్లుల విషయమై ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందించినా కాగితాలకే పరిమితమం అయ్యాయి. గత ప్రభత్వం హయంలో గ్రామ పంచాయతీలకు భారీ మొత్తంలో నిధులు పెండింగ్‌లో పెట్టింది. దీంతో కాంగ్రెస్ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 9990 బిల్లులు ఒకే రోజున క్లియర్చేసింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల నిధులకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకు గాను ఒకే విడతలో రూ.10 లక్షల లోపు బిల్లులను సర్కారు చెల్లించింది. వీటితో పాటుగా ఎస్డీఎఫ్(ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద చేపట్టిన వివిధ పనులకు రూ.85 కోట్లను సైతం విడుదల చేసింది.