Rajiv Gandhi Vardhanthi : సోమాజిగూడ సర్కిల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘన నివాళులు

వి హనుమంతరావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 34 వ వర్ధంతి

On
Rajiv Gandhi Vardhanthi : సోమాజిగూడ సర్కిల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘన నివాళులు

 రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు 

హైదరాబాద్, మే 21 — ప్రభాత సూర్యుడు

నేడు బుధవారం మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో, మాజీ ప్రధాని భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి పి సి సి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, పెద్దలు జానారెడ్డి వి. హనుమంత రావు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బీర్ల ఐలయ్య , రాజ్యసభ సభ్యులు ఏ అనిల్ కుమార్ యాదవ,  చైర్మన్లు శివసేనారెడ్డి , సాయికుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

 పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు మహిళలకు గ్రామపంచాయతీలలో రిజర్వేషన్ ఇప్పించిన ఘనత శ్రీ రాజీవ్ గాంధీ దే అని అన్నారు.

అనంతరం వి హనుమంతరావు గారు మాట్లాడుతూ..దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు, మాజీ ప్రధాని భారతరత్న శ్రీరాజీవ్ గాంధీ గారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ రెడ్డి శ్రీలత శ్రీనివాస్ యాదవ్,  మహాలక్ష్మి రామన్ గౌడ్, లక్ష్మణ్ యాదవ, బొల్లు కిషన్ జగదీశ్వర్ రావు, లఘు పతి యాదగిరి గౌడ్, అప్సర్ యూసుఫ్, అది అవినాష్, శంభుల శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 11

Latest News

Prajapalana: కేసీఆర్ సర్కారులోని పెండింగ్ బిల్లులు రేవంత్ క్లియర్ Prajapalana: కేసీఆర్ సర్కారులోని పెండింగ్ బిల్లులు రేవంత్ క్లియర్
గ్రామ పంచాయతీలకు భారీ ఊరట.. పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన సర్కార్...!! హైదరాబాద్ — ప్రభాత సూర్యుడు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పెండింగ్‌ బిల్లులను ఎట్టకేలకు...
Indiramma Indlu : దసరా నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోండి
Rajiv Gandhi Vardhanthi : సోమాజిగూడ సర్కిల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘన నివాళులు
AP liquor scam : స్కాంలో స్కీమ్: 1000 కిలోల బంగారం కొన్న మద్యం మాఫియా
Ibrahimpatnam constituency : ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు 
Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా విడుదల టైంలో సినిమా థియేటర్లు బంద్ కు ఆదేశించింది ఎవరు ?
MLA Gandra Satyanarayana Rao : ఆర్ఎంపీ డాక్టర్ల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర