Munugodu Congress : కాంగ్రేస్ ప్రభుత్వంలోనే పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రేస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు అనంత చంద్ర శేఖర్ గౌడ్

Congress Party Chandur Municipality President Anant Chandra Shekhar Goud Distributing CM Relief Fund Cheques
కాంగ్రేస్ ప్రభుత్వంలోనే పేదల సంక్షేమానికి పెద్దపీట
- కాంగ్రేస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు అనంత చంద్ర శేఖర్ గౌడ్
చండూరు - ప్రభాత సూర్యుడు
కాంగ్రేస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, పేదల సంక్షేమానికి కాంగ్రేస్ పార్టీ పెద్దపీట వేస్తుందని కాంగ్రేస్ పార్టీ చండూరు మున్సిపాలిటీ అధ్యక్షుడు అనంత చంద్ర శేఖర్ గౌడ్ అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 1,59,000/- రూపాయల చెక్కులను 5 మంది లబ్దిదారులకు అనంత చంద్ర శేఖర్ గౌడ్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరమని, పేదల సంక్షేమమే ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి దిశగా ముందుకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, నల్లగంటి మల్లేష్, కోడి శ్రీనివాసులు, సంకోజు బ్రాహ్మం, గండూరి జనార్ధన్, భూతరాజుదశరథ, బెల్లంకొండ శేఖర్, ఐతరాజు మల్లేష్, బోడ వెంకటేశం, జావిద్ తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల వివరాలు :
- ఏ.మధుసూదన్ చండూరు 9, 000/-
- ఎమ్. సరిత చండూరు 28000/-
- అమృత చారి చండూరు 22,000/-
- చిట్టిమల్ల భిక్షమయ్య చండూర్ 60,000/-
- కారింగు ఈశ్వరమ్మ చండూరు 40,000/-
Related Posts
Latest News
