Jr NTR : దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఎన్టీఆర్‌ ?

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సమర్పణలో మూవీ

On
Jr NTR : దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఎన్టీఆర్‌ ?

దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ లో నటించేందుకు తారక్‌ గ్రీన్‌ సిగ్నల్‌

దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఎన్టీఆర్‌?

మూవీ డెస్క్ - ప్రభాత సూర్యుడు

తాజా సమాచారం ప్రకారం సినీ పితామహుడిగా పరిశ్రమ కొనియాడే దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ లో నటించేందుకు తారక్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తుంది. ఈ ప్రాజెక్టు వెనుక రాజమౌళి, కార్తికేయ, వరుణ్‌ గుప్తా ప్రమేయం కూడా ఉందని టాక్‌. అంతే కాదు.. ఇప్పటికే స్టిప్ట్ర్‌ కూడా సిద్ధం కాగా, అది విన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ చాలా ఎగ్జైట్‌ అయి ఓకే చేశారట. అయితే భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రెండేళ్ల కిందటనే ’మేడ్‌ ఇన్‌ ఇండియా’ అనే సినిమా అనౌన్స్‌ చేయగా, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సమర్పణలో నితిన్‌ కక్కర్‌ మూవీని తెరకెక్కించబోతున్నట్టు తెలిపారు.Screenshot 2025-05-15 215649 దీనికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, త్వరలో వెల్లడిస్తామని అప్పుడు చెప్పగా, ఆ తర్వాత దాని నోరు విప్పింది లేదు. కాని ఇప్పుడు ఉన్నట్టుండి ఇందులో ఎన్టీఆర్‌ నటిస్తారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దాదాసాహెబ్‌ ఫాల్కే జీవితం చాలా పెద్దది. అలాంటి కథలను కచ్చితంగా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. అందుకే జూనియర్‌ ఎన్టీఆర్‌ లాంటి నటు-డు అయితేనే ఈ ప్రాజెక్ట్‌ భాగా చేయగలరు. మరి ఇండియన్‌ సినిమా పుట్టుక, పెరుగుదలను తెలియజేస్తూ.. సినిమాలకి బీజం ఎక్కడ పడిరది, ఎదిగే క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది అనేది చిత్రంలో చూపించనున్నారట.

Views: 4

Latest News

Prajapalana: కేసీఆర్ సర్కారులోని పెండింగ్ బిల్లులు రేవంత్ క్లియర్ Prajapalana: కేసీఆర్ సర్కారులోని పెండింగ్ బిల్లులు రేవంత్ క్లియర్
గ్రామ పంచాయతీలకు భారీ ఊరట.. పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన సర్కార్...!! హైదరాబాద్ — ప్రభాత సూర్యుడు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పెండింగ్‌ బిల్లులను ఎట్టకేలకు...
Indiramma Indlu : దసరా నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోండి
Rajiv Gandhi Vardhanthi : సోమాజిగూడ సర్కిల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘన నివాళులు
AP liquor scam : స్కాంలో స్కీమ్: 1000 కిలోల బంగారం కొన్న మద్యం మాఫియా
Ibrahimpatnam constituency : ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు 
Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా విడుదల టైంలో సినిమా థియేటర్లు బంద్ కు ఆదేశించింది ఎవరు ?
MLA Gandra Satyanarayana Rao : ఆర్ఎంపీ డాక్టర్ల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర