Tourist Family : 5 కోట్ల బడ్జెట్..55 కోట్ల వసూళ్ళు
తమిళనాట బ్లాక్ బాస్టర్ మూవీ "టూరిస్ట్ ఫ్యామిలీ"

తమిళనాట పెద్ద హిట్ కొట్టిన టూరిస్ట్ ఫ్యామిలీ
తమిళనాట పెద్ద హిట్ కొట్టిన టూరిస్ట్ ఫ్యామిలీ
మూవీ డెస్క్ - ప్రభాత సూర్యుడు
ఈ మధ్య తమిళంలో పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలే తమ హావా చూపిస్తున్నాయి. ఈ ఏడాదిలో వచ్చిన లబ్బర్ పందు, మెయ్యాళగన్, కుడుంబస్తాన్, డ్రాగన్ చిత్రాలు సూపర్ హిట్‌లు అందుకున్నాయి. అయితే ఇదే కోవలో చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది టూరిస్ట్ ఫ్యామిలీ. తమిళ నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాళ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. తలైవర్ రజనీకాంత్‌తో పాటు- నటుడు శివ కార్తికేయన్ కూడా ఈ సినిమా చూసి చిత్రబృందంని ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారు. ఇదిలావుంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరోవైపు తక్కువ బడ్జెట్‌తో రూపొందినప్పటికీ, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఒక తమిళ కుటు-ంబం తమ స్వస్థలాన్ని విడిచిపెట్టి భారతదేశానికి శరణార్థులు(స।ªబిషగ॥)గా వస్తారు. అనంతరం వారు చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్లు ఎవరు అనేది చెప్పకుండా దాచిపెట్టాల్సి వస్తుంది. అలా దాచిపెడుతూ ఉండగా అనుకోకుండా రామేశ్వరం దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ సంఘటన జరుగుతుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెడతారు. అయితే ఈ కేసుకి వీరికి సంబంధంమేంటి.. శ్రీలంక నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలేమిటి అనేది ఈ సినిమా కథ.