Aler MLA Beerla Ilaiah : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఆత్మహత్యకు పాల్పడితే తన సొంత ఊరిలోనే చేసుకునేవాడు..ఎమ్మెల్యే ఇంట్లో ఎందుకు చేసుకుంటాడని పలు అనుమానాలు

On
Aler MLA Beerla Ilaiah : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

గత కొంతకాలంగా మృతుడు గంధమల్ల రవి భార్యకు ఎమ్మెల్యే ఐలయ్య అక్రమ సంబంధం ఉందని బిఆర్ఎస్ సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో ప్రచారం

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య
 
యాదాద్రి భువనగిరి - ప్రభాత సూర్యుడు
 
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇంట్లో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఎమ్మెల్యే ఐలయ్య వ్యక్తిగత సహాయకుడు గంధమల్ల రవి (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలోని మూడో అంతస్తు పెంట్‌హౌస్‌లో రవి శుక్రవారం మరణించినట్లు గుర్తించారు. గంధమల్ల రవి ఐలయ్య వ్యక్తిగత సహాయకుడిగా గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. పెంట్‌హౌస్‌లో రవి తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నాడు.images (2)
 
అయితే.. బీర్ల ఐలయ్య ఇటీవల రవిని మందలించినట్లు తెలుస్తోంది. ఎందుకు మందలించాడనేది పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇటీవల ఎమ్మెల్యే సన్నిహితుడికి రవికి మధ్య వాగ్వాదం జరిగిందని స్థానిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వ్యవహారమే రవి మృతికి దారితీసి ఉంటుందని బంధవులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడు రెండు రోజుల క్రితం తన సొంత గ్రామమైన సైదాపురానికి వెళ్లి శుక్రవారం యాదగిరిగుట్టకు తిరిగి వచ్చాడని ఆ తర్వాత ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా, రవి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఒకవేళ అలాంటి అఘాయిత్యమే చేసుకుంటే తన సొంత గ్రామంలోనే చేసుకునేవాడని, ఎమ్మెల్యే నివాసంలోని మూడో అంతస్తు పెంట్‌హౌస్‌లో ఎందుకు చేసుకుంటాడని సైదాపురం గ్రామస్థులు చెబుతున్నారు. 
 
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా మృతుడు గంధమల్ల రవి భార్యకు ఎమ్మెల్యే ఐలయ్య అక్రమ సంబంధం ఉందని, ఈ విషయాన్ని బైటికి పొక్కకుండా ఎమ్మెల్యే ఐలయ్య విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని బిఆర్ఎస్ సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తుంది.👇 images (3)
Views: 342

Latest News

Aler MLA Beerla Ilaiah : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి Aler MLA Beerla Ilaiah : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గత కొంతకాలంగా మృతుడు గంధమల్ల రవి భార్యకు ఎమ్మెల్యే ఐలయ్య అక్రమ సంబంధం ఉందని బిఆర్ఎస్ సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో ప్రచారం
TG TET Hall Tickets : అందుబాటులోకి తెలంగాణ టెట్‌ హాల్‌ టికెట్లు..ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Ration Distribution : 3 నెలల రేషన్ ఇంకా తీసుకోలేదా?.. మీకో బిగ్ అలర్ట్.. గుడ్ న్యూస్..!!
Telangana Cabinet : 6 మంత్రి పదవుల్లో ముగ్గురికి బెర్త్ కన్షామ్.. 3 పెండింగ్
Ibrahimpatnam Constituancy : ఎమ్మెల్యే మనుషలమంటూ స్థానిక నాయకుల అక్రమ నిర్మాణాలు ?
No Traffic Rules : మేము రూల్స్ పెడతాం..పాటించం..!
Suryapet News Update : రాత్రి వేళల్లో గేదెలను రోడ్డపైకి వదిలితే కఠిక చర్యలు