IPL 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ అరాచకం

కలకత్తా నైట్ రైడర్స్ తో మూడు వికెట్ల నష్టానికి 278 పరుగులు

On
IPL 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ అరాచకం

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. పరుగుల సునామీ సృష్టించారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ అరాచకం

హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు 

2025 ఐపీఎల్ లో భాగంగా కలకత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మూడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. పరుగుల సునామీ సృష్టించారు. 398270.6

ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తిం చారు. కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ 105 నాటౌట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడికి ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 76 కూడా జతకలిశాడు. 

దీంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఈ సీజన్‌లో తమ చివరి మ్యాచ్ ఆడుతున్నాయి..

టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా బౌలింగ్‌ మొదలుపెట్టింది. కోల్‌కతా బౌలర్లను ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ (32) బెంబేలెత్తించారు. అభిషేక్ అవుటైన తర్వాత వచ్చిన క్లాసెన్ మరింత విధ్వంసం సృష్టించాడు20250323111416_kishanfifrt

ప్రతి ఓవర్లో ఫోర్‌లు, సిక్స్‌ లు కొడుతూ అలరించాడు. బంతిని బౌండరీ అవతలకు పంపడమే లక్ష్యంగా ఆడా డు. 37 బంతుల్లోనే మెరు పు శతకం సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ.

చివర్లో ఇషాన్ కిషన్ (29) కూడా చెలరేగాడు. దీంతో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పో యి 278 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి కోల్‌‌కతా బౌలర్లందరూ షాక్ తిన్నా రు. బౌలర్లందరూ ఓవర్‌కు 11 పరుగులకు పైగానే సమర్పించుకున్నారు. 

ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీశాడు. వైభవ్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.

Views: 545

Related Posts

Latest News

Narayana's NOVOUS Event : నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి Narayana's NOVOUS Event : నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి
నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న కుమారి షర్మిల భార్గవి చైతన్యపురి నారాయణ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు  అద్భుత నృత్య ప్రదర్శనతో షర్మిల భార్గవికి ప్రశంసల వెల్లువ...
79th Indipendent : ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Achampet News : అచ్చంపేట్ కాంగ్రెస్ కు గట్టి షాక్
Rangareddy News : రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా  కె చంద్రా రెడ్డి బాధ్యతలు
Rangareddy News : ప్రణాళిక బద్దంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహించాలి
CM Relief Fund : పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్