Dy CM Pawan Kalyan: తెలుగుదేశం మహానాడు జరుగుతున్న టైం లో పవన్ కళ్యాణ్ దాడులు

సినిమా థియేటర్లో తనిఖీలు చేపట్టిన అధికారులు, సినిమా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

On
Dy CM Pawan Kalyan: తెలుగుదేశం మహానాడు జరుగుతున్న టైం లో పవన్ కళ్యాణ్ దాడులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సినిమా థియేటర్లలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

సినిమా థియేటర్లో తనిఖీలు చేపట్టిన అధికారులు

  • సినిమా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలి
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అమరావతి - ప్రభాత సూర్యుడు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రంలో కదలిక వచ్చింది ఆర్డిఓ, ఎమ్మార్వో సోదాలు అగ్నిమాపక సిబ్బంది కాకినాడ సినిమా రోడ్డులో చాణిక్య, చంద్ర గుప్తా, థియేటర్లలో మంగళవారం రాత్రి తనిఖీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సినిమా హాల్లో నిర్వహణ ను పకడ్బందీగా చేపట్టి ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Click Here to Read More👉 TTD Updates : టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు  సస్పెన్షన్ 

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు థియేటర్లలో సినిమా టికెట్ల రేట్ల కన్నా.. తినుబండారాలు, పాప్ కార్న్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళ వారం కీలక ఆదేశాలు జారీ చేశారు. 

సినిమా హాళ్ల నిర్వహణపై డిప్యూటీ సీఎం కార్యాల యం మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. థియేటర్లలో తనిఖీలు, సోదాలు నిర్వహించారు. కాకినాడ జిల్లాలో స్థానిక ఆర్డీవో, ఎమ్మార్వోలు.. పోలీ సులు, ఫైర్ డిపార్టుమెంట్ సిబ్బందితో కలిసి థియే టర్లలో సోదాలు నిర్వహిం చారు. 

కాకినాడ సినిమా రోడ్డులోని చాణక్య, చంద్రగుప్త సిని మా థియేటర్లలో సోదాలు నిర్వహించారు. థియేటర్ల లో తినుబండారాల నాణ్యత, రేట్లు తదితర అంశాలను పరిశీలించారు. మరోవైపు సినిమా హాళ్ల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళ వారం కీలక ఆదేశాలు జారీ చేశారు. 

థియేటర్లలో ఆహార పానీ యాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. సినిమా హాళ్ల నిర్వహ ణను పకడ్బందీగా చేపట్టా లని.. మెరుగైన సేవలు అందించేలా, సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 

టికెట్ ధర కంటే సినిమా థియేటర్లలో పాప్ కార్న్ వంటి తినుబండారాలు, శీతల పానీయాలు, వాటర్ బాటిళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయనే విషయం గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో థియేటర్లలో తినుబండారాలు, కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ వంటి పదార్థాల ధరలు ఎంత ఉన్నాయి.. థియేటర్లలో ఎంతకు విక్రయిస్తున్నారు.. నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే దానిపై అధికా రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని.. ధరల నియంత్రణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ అధికారు లను ఆదేశించారు. 

రాష్ట్రంలోని మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలో గుత్తాధిపత్యం సాగుతోంద నే విమర్శలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను ఆదేశించారు.

Views: 34

Latest News

Bonalu Festivel : లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు Bonalu Festivel : లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా...
Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు 
Mahalaxmi Scheme : త్వరలో తెలంగాణ మహిళలకు ప్రతినెల 2,500
DM&HO RRD : మెడికల్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం 
MLC Kavitha : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి 
BJP Rajasingh : 11 సంవత్సరాల శ్రమకు దక్కిన గొప్ప గౌరవం
Indiramma Canteen : 5 రూపాయలకే కడుపు నిండా భోజనం