May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

అబ్దుల్లాపూర్ మెట్ మండలం, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో సీఐటీయూ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

On
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

మేడే సందర్బంగా మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా

*సీఐటీయూ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు* 

అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు 

ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే  సందర్భంగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో సీఐటీయూ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అనాజ్ పూర్, బాటసింగారం, కవాడిపల్లి, జాఫర్ గూడ, బండ రావిరాల, లష్కర్ గూడ గ్రామాల్లో, అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రం సిపిఎం, సీఐటీయూ జెండాలు ఎగుర వేశారు.

పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించి, కార్యాలయం ముందు సీఐటీయూ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా మాట్లాడుతూ.. కార్మికుల ఐక్యతకు ప్రతీక మేడే అని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తోందని అన్నారు. కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ నిరంతర పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. 

అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో.. 

మేడే ఉత్సవాలను సీఐటీయూ , సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా.. అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా నాయకులు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో.. రంగ వెంకటేష్, చిర్ర శివ, పి శ్రీను, పంచాయతీ కార్మికులు లక్ష్మయ్య, బిక్షపతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. 

అనాజ్ పూర్ గ్రామంలో.. 

సిపిఎం గ్రామా శాఖ ఆధ్వర్యంలో.. ముత్యాలు పార్టీ జెండాను ఎగురవేశారు. ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో.. సత్యనారాయణ, శ్రీశైలం  సీఐటీయూ జెండా ఎగురవేశారు. 

బాటసింగారం గ్రామంలో.. 

గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కార్మికులు పెంటయ్య, మైసయ్య, లక్ష్మయ్య, రాము తదితరులు సీఐటీయూ, సిపిఎం పార్టీ జెండాలను ఎగురవేశారు. 

కవాడి పల్లి గ్రామంలో..

కవాడి పల్లి గ్రామం కేంద్రంలో సిపిఎం పార్టీ జెండాను రంగ వెంకటేష్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతి కార్మికులు పాల్గొన్నారు. 

జాఫర్ గూడ గ్రామంలో.. 

పంచాయతీ కార్మికులు లక్ష్మయ్య, జ్యోతి, మనీల తదితరులు సీఐటీయూ జెండాను ఎగురవేసి మేడే ను ఘనంగా నిర్వహించారు. 

లష్కర్ గూడ లో.. 

మేడే సందర్భంగా సిపిఎం గ్రామ శాఖ సభ్యులు ఊశయ్య, బిక్షపతిలు పార్టీ జెండాను ఎగురవేశారు. 

బండ రావిరాల గ్రామంలో.. 

గ్రామ శాఖ ఆధ్వర్యంలో మల్లయ్య, బాలరాజు లు సిపిఎం పార్టీ జెండాను ఎగురవేసి మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 

పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కేద్రంలో.. 

పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు సీఐటీయూ జెండాను జిల్లా నాయకులూ ఏర్పుల నర్సింహా మున్సిపల్ కార్మికులు మైసయ్య, జంగయ్య, నరసింహ, మైపాల్, తరుణ్ తదితరులతో కలిసి జెండాను ఎగురవేసి మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. 

Views: 53

Latest News

Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు పశ్చిమ బెంగాల్‌ - ప్రభాత సూర్యుడు నీ ముక్కు చాలా అందాంగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నీ ముక్కు...
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు
Turka Yamjal Muncipality : తుర్క యంజాల్ మున్సిపాలిటీ ఇంచార్జ్ కమిషనర్ గా సింగిరెడ్డి రవీందర్ రెడ్డి*