Saraswathi Pushkaralu : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సరస్వతి పుష్కరాలు గ్రాండ్ సక్సెస్

భక్త జనసంద్రంతో పోటెత్తిన కాలేశ్వరం..నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు

On
Saraswathi Pushkaralu : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సరస్వతి పుష్కరాలు గ్రాండ్ సక్సెస్

నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు

 భూపాలపల్లి - ప్రభాత సూర్యుడు

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధ్యాత్మికత తో శోభిల్లిన సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నా నాల కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. 

Click Here to Read More👉 Prajapalana : ప్రజావాణికి వచ్చే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి

భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు దంపతులు కలిసి త్రిగుణాత్మక నదుల సాన్నిధ్యంలో స్నానం చేసి పుణ్యఫలాన్ని అందుకుం టున్నారు. తీరం వెంట సైకత లింగాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే, పితృదేవతలకు శ్రాద్ధకర్మలతో తీరాన్ని పరిపూర్ణంగా మార్చారు.

Click Here to Read More👉 Vigilance Rides : బ్రేకింగ్ న్యూస్ -- మున్సిపాలిటీ కార్యాలయాలపై విజిలెన్స్ తనిఖీలు

ఈ సాయంత్రం 7 గంటలకు త్రివేణి సంగమంలో సప్తహా రతులు జరగనున్నాయి. అలాగే పుష్కరాల ముగిం పు సందర్భంగా పూజారు లు చండీ హోమాన్ని నిర్వహించనున్నారు. చివరి రోజు కావడంతో అధికారు లు భారీగా భక్తుల రాకను ఊహించి ట్రాఫిక్‌ ఇబ్బందు లు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

Click Here to Read More👉 UP CM Adityanath : అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

సాయంత్రం పుష్కర స్నానానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రానున్నారు. అనంతరం ముగింపు వేడుకల్లో పాల్గొని నవరత్నామాల హారతిని దర్శించనున్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, నాగఫణి శర్మలు పాల్గొంటారు. 

పుణ్యస్నానం అనంతరం భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతూ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. సరస్వతీ మాత, శుభానం దదేవి అమ్మవారుల దర్శనార్థం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఒకవైపు భక్తి భావన, మరో వైపు భక్తుల ఉత్సాహంతో కాళేశ్వరం పుష్కర క్షేత్రంగా ప్రకాశించింది.

Views: 49

Latest News

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్ Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో U టర్న్ తీసుకున్న RS ప్రవీణ్ కుమార్
వెబ్ డెస్క్ - ప్రభాత సూర్యుడు అప్పట్లో BRS ప్రభుత్వం, KCR పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ప్రవీణ్ కుమార్ ఎంక్వైరీకి పిలిచేసరికి మాట మార్చాడు....
Prajapalana : ప్రజావాణికి వచ్చే ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి
UP CM Adityanath : అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
Wife victims : భర్త నాలుకను కొరికి మింగిన భార్య
Vigilance Rides : బ్రేకింగ్ న్యూస్ -- మున్సిపాలిటీ కార్యాలయాలపై విజిలెన్స్ తనిఖీలు
Bonalu Festivel : లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు