CPM Party : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతుల ఆందోళన

అర్హులైన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని సిపిఎం ధర్నా

On
CPM Party : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతుల ఆందోళన

అర్హులైన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని సిపిఎం ధర్నా 

అబ్దుల్లాపూర్ మెట్ - ప్రభాత సూర్యుడు 

ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల భూములకు తెలంగాణ పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. అర్థులైనా రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలని మంగళవారం ఇబ్రహీం పట్నం లోని ఆర్డీఓ కార్యాలయం ముందు అబ్దుల్లాపూర్ మెట్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో ధర్నా చేసారు.WhatsApp Image 2025-03-18 at 3.42.23 PM ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని అనాజ్ పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 274, 275, 276, 277, 278, 281లో 1991 సంవత్సరంలోనే అర్హులైన 125 మంది పేద రైతులకు ఒకఎకరం చొప్పున సీలింగ్ పట్టాలు, పాస్ బుక్కులు అప్పటి ప్రభుత్వం  ఇచ్చిందని, అప్పటి నుండి రైతులు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ పాస్ బుక్కులు ఇవ్వకుండా వేధిస్తున్నారని అన్నారు. అధికారు చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ప్రయోజనమే లేకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించామని పేర్కొన్నారు.WhatsApp Image 2025-03-18 at 3.36.47 PM ఆనాటి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన అర్హులైన పేదలకు భూములు ఇస్తే,  తెలంగాణ ప్రభుత్వం కొత్త పాస్ బుకులు ఇవ్వకుండా, ఆ భూమిని పేదల నుంచి గుంజుకుని బడా బాబులకు కట్ట పెట్టాలని చూసింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే అసైన్డ్, పొరం బోకు, సీలింగ్ భూములకు పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం, అధికారులకు వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోయి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేదల నుండి ఈ భూములను గుంజుకుని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలను చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఈ భూములను నమ్ముకుని జీవిస్తున్నపేదలకు పట్టా,  పాసు పుస్తకాలను అందజేసి,  రైతు భరోసా, రైతు బీమా ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏర్పుల నరసింహ డిమాండ్ చేశారు. లేనిచో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆర్డీఓ అనంత రెడ్డికి బాధిత రైతులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు వర్కల ముత్యాలు, కావాలి జంగ య్య, మహేశ్వరం లింగస్వామి, రైతులు బిక్షపతి గౌడ్ మహేష్ గౌడ్, రాములు, మహేష్, యాదయ్య, రంగయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Views: 199

Latest News

Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి
Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు