Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు
అధ్యక్షునిగా యాంజాల సంజీవ

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగా రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు
నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు
రంగారెడ్డి - ప్రభాత సూర్యుడు
పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ నూతనంగా అసోసియేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ కాంట్రాక్ట్ పనులు, పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి తోడ్పడునున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు యంజాల సంజీవ, ఉపాధ్యక్షులు రవీందర్, తోట విజయేందర్ యాదవ్, జనరల్ సెక్రటరీ విక్రమ్ బాబు, జాయింట్ సెక్రెటరీలు దేశారం మహేష్ గౌడ్, పండుగుల రమేష్, ట్రెజరర్ సోమగోని రమేష్ గౌడ్, అడ్వైజర్ పోలపల్లి రాజు, కార్యవర్గ సభ్యులు లింగస్వామి, స్వామి, సందీప్ శివరాజ్ సింగ్, లక్ష్మణ్, ప్రవీణ్, గుంజి నారాయణ, కరుణ్ కుమార్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.