Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
అభినందనలు తెలిపిన మాజీ సిఎస్ శాంతికుమారి

చీఫ్ సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరిస్తున్న రామకృష్ణా రావు
సిఎస్‌గా రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరణ
- అభినందనలు తెలిపిన మాజీ సిఎస్ శాంతికుమారి
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణా రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి పదవీ విరమణ చేయడంతో.. రామకృష్ణారావును ప్రభుత్వం నూతన సిఎస్ గా నియమించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తన సర్వీసులో నల్లగొండ జాయింట్ కలెక్టర్‌గా, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్‌గా, 2016 నుంచి ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2021 నుంచి ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న కుడ్లిగి రామకృష్ణా రావు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సిఎస్ శాంతికుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కొత్త సిఎస్‌కు ఆమె అభినందనలు తెలిపారు.