Tesla Cars : ఇక రయ్ రయ్ మని పరుగులు..

ఇండియాలో అమ్మకానికి టెస్లా కార్లు రెడీ

On
Tesla Cars : ఇక రయ్ రయ్ మని పరుగులు..

టెస్లా అమ్మకానికి కార్లు సిద్ధం

ముంబై - ప్రభాత సూర్యుడు

ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్‌ మస్క్‌ సంస్థ అయిన టెస్లా కంపెనీ కార్ల అమ్మకానికి భారత్‌ లో రంగం సిద్ధం అయింది. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ లోని సుమారు 4వేల చదరపు అడుగులకు పైగా ఆస్తిని లీజుకు తీసుకుంది. ఇందులోనే టెస్లా కొత్త కార్ల షో రూం ప్రారంభించనుంది. ఈ షో రూం నెలవారీ అద్దె కోసం రూ.35,26,665 చెల్లిస్తుంది. కంపెనీ రూ. 2,11,59,990 సెక్యూరిటీ డిపాజిట్‌ కూడా చెల్లించింది. ఈ నేపథ్యంలో టెస్లా ఇండియాలోకి ప్రవేశం అనేది లాంఛనం అని చెప్పవచ్చు.

దీంతో దీనికి సంబంధించి అన్ని సన్నాహాలు చేస్తుంది సంస్థ. తాజాగా ఇండియాలో రెండు ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల కోసం సర్టిఫికేషన్‌, హోమోలోగేషన్‌ ప్రక్రియను కూడా ప్రారంభించింది. దేశంలో కార్లను అమ్మే ముందు సర్టిఫికేషన్‌, హోమోలోగేషన్‌ ప్రక్రియ తప్పనిసరి.అందుకనే టెస్లా ఇండియా మోటార్‌ అండ్‌ ఎనర్జీ ప్రై.లిమిటెడ్‌ ఇండియాలో మోడల్‌ వై, మోడల్‌ 3 కార్ల హోమోలోగేషన్‌ ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకుంది.హోమోలోగేషన్‌ అనేది ఒక వాహనం రోడ్డు విూద ప్రయాణించడానికి యోగ్యమైనదని.. ఇండియాలో తయారు చేసిన లేదా దేశంలోకి ఇంపోర్ట్‌ చేసుకున్న అన్ని వాహనాలకు విధించిన నిబంధనలకు అనుగుణంగా ఉందని ధృవీకరించే ప్రక్రియ. కేంద్ర మోటారు వెహికల్‌ రూల్స్‌ కు అనుగుణంగా ఉద్గారం, సేఫ్టీ, రోడ్డు యోగ్యత పరంగా వెహికల్‌ ఇండియా మార్కెట్‌ అవసరాలకు సరిపోతుందని సదరు ప్రభుత్వ శాఖ నిర్దారించాలి.ప్రపంచంలోనే భారత్‌ మూడో అతి పెద్ద కార్ల మార్కెట్‌. అమెరికాన్‌ కంపెనీ టెస్లా అడుగుపెట్టడానికి ట్రై చేస్తూనే ఉంది.

దీనికి సంబంధించిన ఇరుపక్షాల మధ్య ఒప్పందాలు పూర్తయ్యాయి.కాబట్టి త్వరలోనే టెస్లా కార్లు మన దేశంలోకి అమ్మకానికి రాబోతున్నాయి. అయితే టెస్లా తయారీ ప్లాంట్‌ ఇండియాలో ప్రారంభిస్తారా?.. లేదా? అనే దానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి అందుబాబులో లేవు. ప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు.. ‘మోడల్‌ 3’ ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (భారత మార్కెట్లో సుమారు రూ.30.4 లక్షలు). ఇండియాలో దిగుమతి సుంకాలను 15`20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్‌ ట్యాక్స్‌, ఇన్సూరెన్స్‌ వంటి అదనపు ఖర్చులతో కలిపి ఆన్‌`రోడ్‌ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ. 35నుంచి 40 లక్షలుగా తయారైంది. టెస్లా మోడల్‌ వై ధరలు రూ.70 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Views: 199

Latest News

Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి
Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు