Cost of Living : ఇక్కడ బ్రతకాలంటే..ఆ ఖర్చు భరించాల్సిందే..!

భారీగా పెరుగుతున్న కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌

On
Cost of Living : ఇక్కడ బ్రతకాలంటే..ఆ ఖర్చు భరించాల్సిందే..!

Rising Cost Of Living in Hyderabad City

భారీగా పెరుగుతున్న కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు

ప్రాథమిక విద్య పూర్తి అయిన తర్వాత ఉన్నత విద్యా కోసం చాలామంది విద్యార్థులు పట్టణాలకు లేదా నగరాలకు వెళుతూ ఉంటారు. పట్టణాల్లో చదువు పూర్తి చేసుకున్న వారు ఉపాధి కోసం నగరాలకు వెళుతూ ఉంటారు. తెలంగాణలో ఏ మూలనో ఉన్న వారు సైతం హైదరాబాదులో జీవించాలని కోరుకునే వారు ఎక్కువగానే ఉన్నారు. ఎందుకంటే హైదరాబాదులో ఏదో ఒక పని చేసుకుంటూ ఉపాధి పొందవచ్చని.. అలాగే డబ్బు బాగా సంపాదించవచ్చని అనుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో జీతాలతో పాటు.. ఖర్చులు కూడా బాగానే పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంటి అద్దె విషయంలో తడిసి మోపెడ అవుతుందని ఇక్కడకి వలస వచ్చిన వారు చెబుతున్నారు. వచ్చే జీవితంలో సగం వరకు ఇంటి అద్దె చెల్లించడానికి సరిపోతుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అద్దె రేట్లు హైదరాబాదులో ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇటీవల ఇన్ఫో మెన్స్‌ ఆన్లైన్‌ విూడియా స్టార్‌ టాప్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ ఫామ్‌ ఓ సర్వే నిర్వహించింది. హైదరాబాదులో లివింగ్‌ కాస్ట్‌ ఎలా ఉంది? అనే దానిపై రీసెర్చ్‌ చేసి వివరాలను బయటపెట్టింది. ఈ పరిశోధనలో భాగంగా మొత్తం దేశవ్యాప్తంగా 10 ప్రధాన నగరాలను ఎంచుకుంది. ఇందులో ముంబై రూము 35, 887 తో మొదటి స్థానంలో ఉండగా.. జైపూర్‌ 27,813 తో చివరి స్థానంలో నిలిచింది. హైదరాబాదు ఆరవ స్థానంలో నిలిచింది. హైదరాబాదులో జీవించాలంటే నెలకు కనీసం 30 నుంచి 50 వేల వరకు ఖర్చు అవుతుందని ఈ సంస్థ తెలిపింది. ఇందులో ప్రధానంగా అద్దె ఇంటికి రూ.8,000 చెల్లించాల్సిందే. ఇది కూడా సింగిల్‌ రూమ్‌ మాత్రమే. కాస్త ఫ్లెక్సిబుల్‌ రూమ్‌ కావాలంటే కనీసం రూపం 15 వేల వరకు అవుతుంది. ఇక కిరాణా ఖర్చులు, రవాణా ఖర్చులు, నిత్యవసరాలు, అదనపు ఖర్చులు కలిపి మొత్తం 31,000 అవుతుందని ఈ సంస్థ తెలిపింది. ఇక పిల్లల స్కూల్‌ ఫీజులు తోపాటు వైద్య ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం సామాన్యులు వీటితోనే సతమతమవుతున్నారు. సినిమా లేదా ఇతర వ్యసనాలు ఉంటే మాత్రం ఈ ఖర్చుల్లో కొన్ని మాయం అవుతుంటాయి. ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలంటే కనీసం రూ.1500 వరకు అవుతుంది. సామాన్యులు నెలకు ఒక్కసారి సినిమాకు వెళ్లిన కనీసం రూ.2,000 వరకు చెల్లించాల్సిందే. ఇక పార్కులు లేదా ఫంక్షన్ల లాంటి కార్యక్రమాలకు మరింత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. 1730699515626అయితే కొందరు వచ్చిన ఆదాయం సరిపోకపోవడంతో అదనంగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఇలా బ్యాంకు నుంచి కూడా రుణాలు తీసుకొని జీవితాన్ని గడుపుతున్నారు. అయితే మిగతా ప్రదేశాల్లో కంటే హైదరాబాదులో అన్ని ధరలు పెరిగిపోయాయి. దీంతో సగటు మానవుడు ఇక్కడ జీవించాలంటే కనీసం రూ. 50వేల ఆదాయం వస్తూ ఉండాలి. కానీ చాలామందికి ఆ పరిస్థితి లేదు. ఒకవేళ అంత జీతం వచ్చినా అదనపు అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. అయితే ఖర్చులను తగ్గించుకొని ప్రయత్నం చేస్తేనే ఆదాయం సరిపోయే అవకాశం ఉంటుందని కొందరు నిపుణులు తెలుపుతున్నారు.

Views: 18

Latest News

Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి
Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు