World History Book : మూడు దశాబ్దాల తరవాత ఒకే వేదికపై తోడళ్లుల్లు
Nara Chandra Babu Naidu and Daggubati Venkateswara Rao on the same stage After 30 years

మూడు దశాబ్దాల తరవాత ఒకే వేదికపై తోడళ్లుల్లు
- పరస్పరం ఆలింగనం చేసుకున్న బాబు, దగ్గుబాటి
విశాఖపట్నం - ప్రభాత సూర్యుడు
తోడల్లుళ్లు సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ’ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడిన అనంతరం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు, దగ్గుబాటి కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా.. ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
Views: 30
Related Posts
Latest News
08 May 2025 06:42:21
ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి