ఘనంగా కొమురవెల్లి మల్లన్న దేవుని కళ్యాణ మహోత్సవం

On
ఘనంగా కొమురవెల్లి మల్లన్న దేవుని కళ్యాణ మహోత్సవం

ఘనంగా కొమురవెల్లి మల్లన్న దేవుని కళ్యాణ మహోత్సవం

సిద్దిపేట జిల్లా - ప్రభాత సూర్యుడు 

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి లో అంగరంగ వైభవంగా శ్రీ మల్లికార్జునస్వామి కళ్యా ణ మహోత్సవం జరగనుంది, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్ములను శ్రీ మల్లికార్జునుడు మనువా డనున్నారు.శివసత్తులసిగాలు, జోగినులు, పోతరాజు ల విన్యాసాలు, పూనకాలు, బోనాలు, డప్పు దరువుల  తో కోరమీసాల స్వామి కొలువు దీరిన కొమురవెల్లి మల్లన్న క్షేత్రంమార్మోగ నుంది. 

ప్రతిఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నిర్వహించే కల్యాణంతో బ్రహ్మోత్స వాలు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి మల్లన్న జాతర సంక్రాంతి పర్వదినం తరువాత వచ్చే ఆదివారం నుంచి ఫాల్గుణ మాసం చివరి ఆదివారం రాత్రి నిర్వహించే అగ్ని గుండాల తో మహా జాతర ముగు స్తుంది. 

ఆదివారం మల్లన్న కల్యాణోత్సవంతో మహా జాతర ప్రారంభంకానున్న నేపథ్యంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రా న్ని అందంగా ముస్తాబు చేశారు. అశేష జనవాహి నికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.కాశీ పీఠాధిపతి పర్యవేక్షణలో మల్లన్న కల్యాణం..

కాశీ పీఠాధిపతి శ్రీమద్ జ్ఞాన సింహాసనాధీశ్వర 1008 జగద్గురు మల్లికా ర్జున విశ్వ రాధ్యా శివ చార్య పర్యవేక్షణలో వీర శైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లన్న కల్యాణం జరుగునుంది. 

వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్న గారి వంశస్తులు, వధువులు మేడలాంబ, కేతమ్మ తరపు న మహాదేవుని వంశస్థులు పెండ్లి పెద్దలుగా వ్యవహరిం చనున్నారు. 

ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించ నున్నారు. 

కల్యాణ మహోత్సవానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరు కానున్నారు. అదే విధంగా దృష్టి కుంభము, ఏకాదశ రుద్రాభిషేకం, రథోత్సవం బండ్లు తిరుగుట కార్య  క్రమాలు నిర్వహిస్తారు.

Views: 9
Tags:

Related Posts

Latest News

Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు Local Body Elections : జూన్ నెలాఖరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ముఖ్య నేతల సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి
Breaking : భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్నాడు
Rachakonda Police : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వి. అశోక్ రెడ్డి 
Rajiv Yuva Vikas : సిబిల్ స్కోరు లేకపోతే రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ రిజెక్టే..
May Day : సీఐటీయూ జిల్లా నాయకులు , సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు
Telangana Update : చీఫ్ సెక్రెటరీగా రామకృష్ణా రావు బాధ్యతలు స్వీకరణ
Rangareddy: నూతనంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు