Betting Apps In Metro : మెట్రో సంస్థ బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చేస్తే తప్పులేదా ?

సజ్జనార్ కు హీరోయిన్ అనన్న నాగెల్ల సూటి ప్రశ్న

On
Betting Apps In Metro : మెట్రో సంస్థ బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చేస్తే తప్పులేదా ?

Heroin Ananya Nagella Questioning About Betting Apps Promotions In Metro from Her twitter account

బెట్టింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేసిన మెట్రో

  • ప్రభుత్వాన్ని నిలదీసిన అనన్య నాగళ్ల

మూవీ డెస్క్ - ప్రభాత సూర్యుడు

బెట్టింగ్‌ యాప్‌ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో సీరియస్‌ అయిన తెలంగాణ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఇదిలావుంటే బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసినందుకు సినీ ప్రముఖులపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. నటి అనన్య నాగళ్లను బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసినందుకు సోషల్‌ మీడియాలో తిట్టడం మొదలుపెట్టారు. అయితే తనపై వస్తున్న విమర్శలపై స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది అనన్య. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రభుత్వమే ప్రమోట్‌ చేస్తుంటే మాకేలా తెలుస్తుంది అంటూ ప్రశ్నించింది.

Click Here to Read More👉 Bonalu Festivel : లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు

ఈ సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో ప్రమోట్‌ చేస్తున్న వన్‌ ఎక్స్‌ బెట్టింగ్‌ యాప్‌ ఫొటోను పంచుకుంది. ప్రభుత్వానికి చెందిన సంస్థ (హైదరాబాద్‌ మెట్రో) బెట్టింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేస్తుంటే అవి చట్టవిరుద్ధంగా ప్రమోట్‌ చేయబడుతున్నాయని మనం ఎలా తెలుసుకోవాలి అంటూ అనన్య ఇన్‌స్టాలో రాసుకోచ్చింది. మరోవైపు తాను బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసినందుకు క్షమాపణలు తెలిపింది అనన్య. ‘దయచేసి నన్ను క్షమించండి. నేను తెలిసి తప్పు చేయలేదు. అందరూ టాప్‌ సెలబ్రిటీలు చేస్తున్నారు కాబట్టి తప్పు కాదని అనుకున్నాను. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉంటాను. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తాను. అప్పట్లో ఆలోచన లేకుండా, అవగాహన లేని స్థితిలో ఈ పని చేశాను. ఒక వీడియో స్టోరీ పోస్ట్‌ చేసినందుకు వాళ్లు రూ.1,20,000 చెల్లించారు. అప్పుడు నేను దాన్ని కేవలం గేమింగ్‌ యాప్‌గా, ఒక సాధారణ యాడ్‌గా మాత్రమే చూశాను. కానీ అది బెట్టింగ్‌ యాప్‌ అని, దీని వెనుక ఇన్ని సమస్యలు ఉంటాయని అప్పట్లో గ్రహించలేకపోయాను. తర్వాత వాళ్లు ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి ఇచ్చేశాను అంటూ అనన్య చెప్పుకోచ్చింది.

Click Here to Read More👉 EAGLE : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. 'హైడ్రా'లాంటి మరో వ్యవస్థ

Views: 63

Latest News

Bonalu Festivel : లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు Bonalu Festivel : లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు
లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా...
Karnataka Crime : కర్ణాటకలో కీచక ఉపాధ్యాయులు 
Mahalaxmi Scheme : త్వరలో తెలంగాణ మహిళలకు ప్రతినెల 2,500
DM&HO RRD : మెడికల్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం 
MLC Kavitha : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి 
BJP Rajasingh : 11 సంవత్సరాల శ్రమకు దక్కిన గొప్ప గౌరవం
Indiramma Canteen : 5 రూపాయలకే కడుపు నిండా భోజనం